Home » AP High Court
కూటమి నేతలపై గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసభ్య పదజాలంతో కుటుంబ సభ్యులు, తల్లులపై దాడి చేస్తారా అంటూ ప్రశ్నించింది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆయన కుటుంబ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అసభ్యకర పోస్టులు పెట్టారనే ఆరోపణలతో తిరుపతి తూర్పు ఠాణా పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ విశాఖపట్నానికి చెందిన గోర్లి సత్య నీరజ్ కుమార్ నాయుడు అనే వ్యక్తి ఏపీ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సీఎం చంద్రబాబుకు ఏపీహైకోర్టు ఎంప్లాయూస్ అసోసియేషన్ ప్రతినిధులు లేఖ రాశారు. హైకోర్టు విభజన సమయంలో, తక్కువ వ్యవధిలో, తెలంగాణ నుంచి ఉద్యోగులందరూ కుటుంబాలను విడిచిపెట్టి ఆంధ్ర ప్రదేశ్కు వచ్చారని తెలిపారు.
Andhrapradesh: అసభ్యకర పోస్టుల పెట్టినవారిపై పోలీసులు కేసులు పెడితే తప్పేముందని న్యాయస్థానం ప్రశ్నించింది. ఒక దశలో న్యాయమూర్తులను కూడా అవమానపర్చేలా పోస్టులు పెట్టారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టీకరించింది.
ముంబై నటి కాదంబరి జెత్వానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురైన విషయం తెలిసిందే. ముంబై నుంచి ప్రత్యేక ఫ్లైట్లో తీసుకొచ్చి.. ఒక గెస్ట్ హౌస్లో ఉంచి మరీ వేధించారు. ముంబై నటి కాదంబరి జెత్వానీ వేధింపుల వ్యవహారంలో పలువురు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ల ప్రమేయం ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో నిందిత ఐపీఎస్ అధికారులు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది.
Andhrapradesh: ఆంధ్రజ్యోతి విలేఖరి హత్య కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ హత్య కేసులో వైసీపీ తుని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు. ఈరోజు (మంగళవారం) బెయిల్ పిటిషన్పై న్యాయస్థానంలో విచారణకు వచ్చింది.
Andhrapradesh: సినీనటి కాదంబరి జెత్వానీ కేసులో వైసీపీ నేతకు హైకోర్టు షాక్ ఇచ్చింది. నటి జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో విజయవాడ కోర్టు ఇచ్చిన రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఈరోజు విచారణకు వచ్చింది. అయితే
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో తన స్నేహితుడు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసానికి వెళ్లారు. దీంతో అల్లు అర్జున్తోపాటు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ వారిద్దరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై శుక్రవారం వాదనలు ముగిశాయి. నిర్ణయాన్ని నవంబర్ 6వ తేదీన వెల్లడిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా కుంచం మహేశ్వరరావు, టీసీ ధనశేఖర్, చల్లా గుణరంజన్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు.
Andhrapradesh: మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటిషన్పై విచారణ హైకోర్టులో వాయిదా పడింది. శుక్రవారానికి కేసు విచారణను వాయిదా వేసింది న్యాయస్థానం. సాక్షాలను తారుమారు చేసే అవకాశం ఉందని, అతనికి బెయిల్ ఇవ్వొదని పోలీసుల తరుపున న్యాయవాది వాదనలు వినిపించే అవకాశం ఉంది.