Share News

LokSabha Elections: రంగంలోకి హీరోలు

ABN , Publish Date - Apr 27 , 2024 | 07:56 PM

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక పార్టీల అధినేతలు రోడ్డు షోలు, భారీ బహిరంగ సభల్లో పాల్గొని.. తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్జప్తి చేస్తున్నారు. అయితే తమ ప్రచారానికి స్లినీ గ్లామర్‌ను సైతం జోడించేందుకు ఆ యా పార్టీలు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి.

LokSabha Elections: రంగంలోకి హీరోలు

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక పార్టీల అధినేతలు రోడ్డు షోలు, భారీ బహిరంగ సభల్లో పాల్గొని.. తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్జప్తి చేస్తున్నారు. అయితే తమ ప్రచారానికి స్లినీ గ్లామర్‌ను సైతం జోడించేందుకు ఆ యా పార్టీలు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి.

AP Elections: వైసీపీ మేనిఫెస్టో: నాడు - నేడు

అందులోభాగంగా టాలీవుడ్ సినీ హీరోలను ప్రచారంలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే తమ సన్నిహితులు, బంధువుల కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు హీరోలు సైతం ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తుంది.

London: హైదరాబాద్ యువకుడికి 16 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

అయితే ఇప్పటికే చీరాల నుంచి కూటమి అభ్యర్థిగా ఎం ఎం కొండయ్య యాదవ్ బరిలో నిలిచారు. ఆయనకు మద్దతుగా టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ప్రచారం చేశారు. ఆయనకు ఓటు వేయాలంటూ.. రోడ్ షో నిర్వహించి.. ప్రజలకు కోరారు. మరోవైపు హీరో వెంకటేష్ సైతం రేపో మాపో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారనే ఓ చర్చ సైతం ఫిలింనగర్‌లో వైరల్ అవుతుంది.


ఆయన అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్‌లో సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారని సమాచారం. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామసహయం రఘురాంరెడ్డి బరిలో నిలిచారు. ఆయన హీరో వెంకటేష్‌కు స్వయాన వియ్యంకుడు.

LokSabha Elections: మమతా బెనర్జీకి మళ్లీ గాయాలు!

ఆయనకు మద్దతుగా ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారం చేయనున్నారని తెలుస్తుంది. అలాగే ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కైకలూరు అసెంబ్లీ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ బరిలో నిలిచారు.

LokSabha Elections: ఢిల్లీలో ఆప్ గెలుపు కోసం..

హీరో వెంకటేష్‌కు ఆయన సమీప బంధువు. ఈ నేపథ్యంలో ఆయనకు మద్దతుగా కైకలూరు నియోజకవర్గంలో హీరో వెంకటేష్ ప్రచారం చేపట్టనున్నారని సమాచారం. ఇంకోవైపు.. నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగిన హిందూపురంలో సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు.


ఇంకోవైపు పిఠాపురం నుంచి జననేన పార్టీ అధినేత, హీరో పవన్ కల్యాణ్ బరిలో దిగారు. ఆయనకు మద్దతుగా ఇప్పటికే జబర్దస్ ఆర్టిస్టులు ప్రచారం చేస్తున్నారు.

LokSabha Elections: ముచ్చటగా మూడోసారి మోదీని ప్రధానిని చేస్తే..

అలాగే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వీ సైతం ప్రచారం చేస్తున్నారు. రేపో మాపో మెగా ఫ్యామిలీలోని హీరోలు చిరంజీవి, నాగబాబు, వరుణ్ తేజ్, బన్నీ తదితరలు ప్రచారం చేయనున్నారని సమాచారం. ఇక బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి మద్దతుగా టాలీవుడ్‌ నుంచి మరింత మంది నటీనటులు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారనే ఓ చర్చ ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తుంది.

Read National News And Telugu News

Updated Date - Apr 27 , 2024 | 07:57 PM