Share News

పోలీసుల అమరవీరులకు ఘన నివాళి

ABN , Publish Date - Oct 21 , 2024 | 11:26 PM

పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీస్‌స్టేషన ఎదుట ఉన్న అమరవీరుల స్థూపానికి సోమవారం పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు

పోలీసుల అమరవీరులకు ఘన నివాళి
ధర్మవరం : అమరవీరుల స్తూపం వద్ద సీఐలు,ఎస్‌ఐ, సిబ్బంది

ధర్మవరం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీస్‌స్టేషన ఎదుట ఉన్న అమరవీరుల స్థూపానికి సోమవారం పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఇందులో ధర్మవరం డీఎస్పీ శ్రీనివాసులు, వనటౌన, టూటౌన సీఐలు నాగేంద్రప్రసాద్‌, రెడ్డప్ప, ఎస్‌ఐ గోపీకుమార్‌, ట్రాఫిక్‌ ఎస్‌ఐ వెంకటరాముడు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సిబ్బంది, పలువురు రక్తదానం చేశారు. మొత్తం 73 మంది రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని డీఎస్పీ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ కేతన్న, రక్తబంధం ట్రస్టు వ్యవస్థాపకులు కన్నా వెంకటేశ, సభ్యులు చంద్ర పాల్గొన్నారు.


ముదిగుబ్బ : ముదిగుబ్బలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని సీఐ శ్యామరావు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. పీవీఎస్‌ పాఠశాల విద్యార్థులకు పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో కలిసి పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ రాజు, పోలీసులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 11:26 PM