Share News

TTD : టీటీడీ ఈవోగాశ్యామలరావు

ABN , Publish Date - Jun 15 , 2024 | 06:53 AM

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా జే శ్యామలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉన్న ఆయన్ను టీటీడీ ఈవోగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ శుక్రవారం ఉత్తర్వులు

TTD : టీటీడీ ఈవోగాశ్యామలరావు

రిలీవ్‌ కావాలని ధర్మారెడ్డికి ఆదేశం

అమరావతి (ఆంధ్రజ్యోతి)/తిరుమల, జూన్‌ 14: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా జే శ్యామలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉన్న ఆయన్ను టీటీడీ ఈవోగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ధర్మారెడ్డిని ఆ పోస్టు నుంచి రిలీవ్‌ కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి ధర్మారెడ్డిని గత ప్రభుత్వం టీటీడీ అదనపు ఈవోగా నియమించింది. ఆ తర్వాత ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. వైసీపీ ప్రభుత్వం ఓటమి తర్వాత జగన్మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే ధర్మారెడ్డి తనకు సెలవు కావాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. సీఎం చంద్రబాబు తిరుమల పర్యటన ఖరారు అయిన తర్వాత ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు ఆయనకు సెలవు మంజూరు చేసింది. అనేక ఆరోపణలు ఎదుర్కొన్న ధర్మారెడ్డి రిటైర్మెంట్‌ దగ్గరలో సెలవు పెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సెలవు ముగిసిన తర్వాత ఆయన విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

అసోం నుంచి ఏపీకి

1997 బ్యాచ్‌కు చెందిన శ్యామలరావును డీవోపీటీ తొలుత అసోం కేడర్‌కు కేటాయించింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా తనను అసోం కేడర్‌కు పంపారని, తన ర్యాంక్‌ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు కేటాయించాలని క్యాట్‌లో పోరాటం చేశారు. కొంతకాలం అసోంలో పనిచేశాక 2009లో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. విశాఖ కలెక్టర్‌గా, ఏపీఎంఎ్‌సఐడీసీ ఎండీగా, హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ సప్లయ్‌ ఎండీగా పనిచేశారు. ఆయన ఎక్కువ కాలం మున్సిపల్‌ శాఖలో పనిచేశారు. త్వరలో టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Updated Date - Jun 15 , 2024 | 06:53 AM