లడ్డూకు తగ్గని డిమాండ్
ABN , Publish Date - Sep 27 , 2024 | 05:44 AM
శ్రీవారి లడ్డూప్రసాదాలు అపవ్రితం అయినట్టు తేలగానే..రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించి తీసుకున్న దిద్దుబాటు చర్యలు మంచి ఫలితాలను
వారం రోజుల్లో 23 లక్షల మేర విక్రయం
రోజుకు 3 లక్షలకు తగ్గకుండా అమ్మకం
ఫలితమిస్తున్న దిద్దుబాటు చర్యలు
ఈవోతో ‘నందిని’ ప్రతినిధుల భేటీ
నాణ్యతలో తేడా రావడానికి వీల్లేదు
భక్తుల మనోభావాలతో కూడిన అంశమిది: ఈవో
తిరుమల, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి లడ్డూప్రసాదాలు అపవ్రితం అయినట్టు తేలగానే..రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించి తీసుకున్న దిద్దుబాటు చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఫలితంగా తిరుమలలో లడ్డూల విక్రయాల జోరు ఎక్కడా తగ్గలేదు. గడిచిన వారంరోజుల వ్యవధిలో ఏకంగా 23 లక్షల లడ్డూల విక్రయాలు జరగడం గమనార్హం. ఈనెల 19వ తేదీన 3,59,660 లడ్డూలు, 20న 3,17,954, 21న 3,67,607, 22న 3,46,640, 23న 3,08,744, 24న 3,02,174, 25న 3,10,423 లడ్డూల విక్రయాలు జరిగాయి.