Home » Tirupathi News
ఒకప్పట్లో ఊర్లో చెత్తను శివార్లలో పడేసేవారు. కొండల్లా పేరుకుపోయి దుర్గంధం నెలకొనేది. పర్యావరణ సమస్యతో పాటు స్థానికులూ అనారోగ్యం బారిన పడేవారు. ‘స్వచ్ఛ పల్లె’ నినాదంతో అలాంటి చెత్త నుంచి సంపద సృష్టించేలా ఏడేళ్ల కిందట సీఎం హోదాలో చంద్రబాబు రూపకల్పన చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో వీటిని నిర్లక్ష్యంగా వదిలేయగా.. మళ్లీ చంద్రబాబు ప్రభుత్వంలో లక్ష్యం దిశగా అడుగులేసింది. ఫలితం మూడు నెలల్లో జిల్లాలోని పంచాయతీలకు రూ.13.5 లక్షల ఆదాయం వచ్చింది.
చంద్రగిరిలో పట్టణంలో గురువారం సాయంత్రం గాలీవాన బీభత్సం సృష్టించింది. దీంతో కొత్తపేటలోని రోడ్డు పక్కనున్న భారీ చింత చెట్టు నేలకొరిగింది.
విద్యుత్ తీగలు తగిలి ఓ ఎలుగుబంటి మృతి చెందింది.
తిరుపతి నగర పాలక సంస్థ పన్ను వసూళ్లలో తిరుపతి మూడో స్థానంలో నిలిచింది.
ఒంటిమిట్ట రాములోరి కల్యాణం నేపథ్యంలో సీఎం చంద్రబాబు సతీసమేతంగా ఆలయానికి రానున్నారు. భక్తులు, టీడీపీ అభిమానులు సైతం పెద్దఎత్తున పాల్గొనున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.
తిరుపతి-పాకాల-కాట్పాడి రైల్వే డబ్లింగ్కు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లావాసుల సంవత్సరాల కల నెరవేరింది
మాజీ మంత్రి రోజా నోటి దూల వల్లే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకు పరిమితమైందని శాప్ ఛైర్మన్ రవి నాయుడు ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి, సంక్షేమం రాకెట్ వేగంతో దూసుకుపోతున్నట్లు చెప్పుకొచ్చారు.
రుయాస్పత్రిలో నెల రోజులుగా సదరం సర్టిఫికెట్ల పరిశీలన జోరుగా సాగుతోంది. ఇప్పటికే 20కి పైగా నకిలీ సర్టిఫికెట్లను అధికారులు గుర్తించారు.
బియ్యం కార్డుదారుల ఈకేవైసీ నమోదుకు పౌరసరఫరాలశాఖ ఏప్రిల్ 30వ తేదీవరకు గడువు పొడిగించింది.
తిరుపతి జీవకోన ప్రాంతంలో రాజేశ్ అనే వ్యక్తి భార్య సుమతి, పిల్లలు, తల్లి విజయతో కలసి నివాసం ఉంటున్నారు. రాజేశ్, భార్య సుమతి రెండు మీ-సేవా కేంద్రాలను స్థానికంగా నిర్వహిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన భార్గవ్ మూడేళ్ల కిందట రాజేశ్ వద్ద నగదు అప్పుగా తీసుకున్నాడు.