Unannounced inspection : డాడీహోంలో ఆకస్మిక తనిఖీ
ABN , Publish Date - Sep 10 , 2024 | 11:24 PM
మైలవరం డాడీహోంలో జమ్మలమడుగు ఆర్డీఓ శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ లోతేటి శివశంకర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ శ్రీనివాస్, స్థానిక సిబ్బందితో 6వ తేదీ వెళ్లి పరిశీలించినట్లు సమాచారం ఆలస్యంగా వెలుగు చూసింది.
జమ్మలమడుగు, సెప్టెంబరు 10: మైలవరం డాడీహోంలో జమ్మలమడుగు ఆర్డీఓ శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ లోతేటి శివశంకర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ శ్రీనివాస్, స్థానిక సిబ్బందితో 6వ తేదీ వెళ్లి పరిశీలించినట్లు సమాచారం ఆలస్యంగా వెలుగు చూసింది. డాడీహోం యజమాని రాజారెడ్డి మృతి తర్వాత కొత్త కమిటీని ఏర్పాటు చేశారని, మళ్లీ కమిటీ మారిందని, వృద్ధులు తెలిపినట్లు సమాచారం. పది రోజుల కిందట డాడీహోం వృద్ధాశ్రమం వృద్ధులు, విద్యార్థులు, సిబ్బంది ఫౌండేషన్ వివాదంపై ప్రస్తుతం తమకు సేవలు సక్రమంగా అందడం లేదని, రక్షణ కల్పించాలని కలెక్టర్ కార్యాలయంలో బాధితులంతా వెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కలెక్టర్ లోతేటి శివశంకర్ ఆదేశాల మేరకు జమ్మలమడుగు ఆర్డీఓ, స్థానిక సిబ్బందితో ఆకస్మికంగా 6వ తేదీ వెళ్లి పరిశీలించినట్లు సమాచారం ఆలస్యంగా వెలుగు చూసింది. తనిఖీ చేసిన సమస్యలు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఏదేమైనా కమిటీ ట్రస్టు, డాడీహోం, ప్రొద్దుటూరు సమీపంలో ఉన్న పూజా ఇంటర్నేషనల్ స్కూల్‌పై క్షుణ్ణంగా విచారించినట్లు బాధితుల ద్వారా తెలుస్తోంది. డాడీహోంలో విద్యార్థులు, వృద్ధులకు జరుగుతున్న అన్యాయాన్ని కమిటీ ఏమాత్రం పట్టించుకోవడంలేదని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి దృష్టికి బాధితులు తీసుకెళ్లి వినతి పత్రం అందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అనాథలు, అభాగ్యులు, వృద్ధులు, పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం, జిల్లా అధికారులు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. తమకు న్యాయం జరుగుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నట్లు బాధితులు మంగళవారం విలేకరులకు తెలిపారు.