Home » Jammalamadugu
ఎంతో అరుదైన, అపురూపమైన ఆదిమానవుడు రేఖా చిత్రాలు చింతకుంట కొండలో కనువిందు చేస్తున్నాయి. 25 వేల ఏళ్ల కిందట ఇక్కడ మా నవులు ఆవాసం ఏర్పరచుకున్నారని, జీవించా రని, కొండపై చిత్రించిన రేఖా చిత్రాలు ఆధార భూతమై నిలుస్తున్నాయి. ఇక్కడి వాతావర ణం, నీరు, ఆహారం పుష్కలంగా ఉండడంతో ఆదిమానవుడు ఆవాసానికి అనువైన ప్రదేశం గా ఎంచుకుని నివసించి ఉంటారని దాదాపు 200 రేఖాచిత్రాలను తిలకించిన మేధావులు అభిప్రాయపడుతున్నారు.
జమ్మలమడుగు వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఎంపీ అవినాశరెడ్డి నిర్వహించిన ప్రజాదర్బార్లో పలువురు వైసీపీ నేతలు సమస్యలపై ఎంపీని నిలదీశారు.
మైలవరం డాడీహోంలో జమ్మలమడుగు ఆర్డీఓ శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ లోతేటి శివశంకర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ శ్రీనివాస్, స్థానిక సిబ్బందితో 6వ తేదీ వెళ్లి పరిశీలించినట్లు సమాచారం ఆలస్యంగా వెలుగు చూసింది.
స్థానిక రైల్వేస్టేషన్ వద్ద నాగలకట్ట వెళ్లే దారిలో 27వ తేదీ సాయంత్రం గంజాయి నిందితులను అరెస్టు చేసినట్లు జమ్మలమడుగు అర్బన్ సీఐ లింగప్ప తెలిపారు.
అవును.. మీరు వింటున్నది నిజమే..! త్వరలో కడప పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక రాబోతోందని ఒక ఎమ్మెల్యే, ప్రభుత్వంలోని కీలక వ్యక్తి చెప్పడంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడితే హాట్ టాపిక్ అయ్యింది.. ఎవరి నోట విన్నా.. సోషల్ మీడియాలో చూసినా దీని గురించే చర్చ.. అంతకుమించి రచ్చ!..
జమ్మలమడుగు నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసులు144 సెక్షన్ అమలు చేశారు. అభ్యర్థులను, కీలక నేతలను పోలీసులు ఇళ్లకే పరిమితం చేశారు. నిజమ్మలమడుగులోని వైసీపీ, బీజేపీ, టీడీపీ కార్యాలయం వద్ద భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి ఇంటి వద్ద పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున చేరుకున్నాయి.
కడపలో తన ప్రచారంతో వైసీపీలో వణుకు పుడుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) విమర్శించారు. అవినాష్ రెడ్డి హంతకుడు అని ప్రజలు నమ్ముతున్నారన్న షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని మార్చాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్లో మరో ఏడాది మాత్రమే ఎన్నికలకు సమయం ఉంది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు తమకు ఎక్కడైతే గెలుపు అవకాశాలున్నాయో..? ఏ పార్టీ అయితే తమకు టికెట్ ఇస్తుందో..? అని అనుకూల పరిస్థితులను వెతుక్కుంటున్నారు..