Share News

పశువులకు వ్యాక్సిన్లు వేయించండి

ABN , Publish Date - Dec 24 , 2024 | 11:46 PM

పశువులకు సోకే సీజనల్‌ వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన వ్యాక్సిన్లు వేయించాలని పశు వైద్యాధికారి బాలు నాయక్‌ సూచించారు.

పశువులకు వ్యాక్సిన్లు వేయించండి
పాడి ఆవులను పరిశీలిస్తున్న పశువైద్యాధికారి

నంబులపూలకుంట, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): పశువులకు సోకే సీజనల్‌ వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన వ్యాక్సిన్లు వేయించాలని పశు వైద్యాధికారి బాలు నాయక్‌ సూచించారు. మంగళవారం స్థానికంగా నిర్వహించిన పొలం పొలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ఆయన గేదెలు, పశువులను పరిశీలించారు. గొర్రెలకు వచ్చే బొబ్బవ్యాధి నివారణకు షిప్‌ఫాక్స్‌ వ్యాక్సిన, సరక వ్యాధి నివారణకు టీపీఆర్‌ వ్యాక్సిన వేయించాలన్నారు. కోళ్ల పెంపకంలో కొక్కర వ్యాధి నివారణకు వ్యాక్సినేషన వేయించాలని సూచించారు. ఏఓ లోకేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కంది పంటను సాగుచేసిన రైతులు రిజిస్ర్టేషన చేయించుకోవాలన్నారు. కంది పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రబీలో సాగుచేసిన వేరుశనగ, వరి పంటను రైతులు ఈనెలాఖరులోపు పంట బీమా చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎం మౌనిక, రైతు సేవా కేంద్రం సిబ్బంది ధనలక్ష్మీ, యుగంధర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 11:46 PM