Share News

వాల్మీకి జాతి కోసం పని చేస్తా

ABN , Publish Date - Nov 22 , 2024 | 12:16 AM

వాల్మీకి జాతీ కోసం పని చేస్తానని రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన డైరెక్టర్‌ వలసల రామకృష్ణ అన్నారు.

వాల్మీకి జాతి కోసం పని చేస్తా
డోనలో వాల్మీకి విగ్రహం వద్ద వలసల రామకృష్ణను సన్మానిస్తున్న బోయ వాల్మీకి సంఘం నాయకులు

సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు

డోన రూరల్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): వాల్మీకి జాతీ కోసం పని చేస్తానని రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన డైరెక్టర్‌ వలసల రామకృష్ణ అన్నారు. గురువారం వాల్మీకి బోయ సంఘం ప్రొఫెషనల్‌ జిల్లా వింగ్‌ ప్రెసిడెంట్‌ నల్లబోతుల సురేష్‌ ఆధ్వర్యంలో వలసల రామకృష్ణకు సన్మాన కార్యక్రమం చేపట్టారు. డోన పట్టణంలోని వాల్మీకి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన డైరెక్టర్‌ వలసల రామకృష్ణకు శాలువలు, పూలమాలలతో సత్కరించారు. వలసల రామకృష్ణ మాట్లాడుతూ వాల్మీకుల రాష్ట్ర కార్పొరేషన డైరెక్టర్‌గా తనకు పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వాల్మీకి బోయ సంఘం నాయకులు ఇందిరానగ ర్‌ మధు, ఎర్రిస్వామి, కూరగాయల శ్రీరాములు, మద్దయ్య, శ్రీధర్‌నాయుడు, విజయ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2024 | 12:16 AM