Share News

‘హైందవ శంఖారావం కార్యక్రమాన్ని జయప్రదం చేయండి’

ABN , Publish Date - Nov 03 , 2024 | 11:33 PM

హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోరుతూ విశ్వ హిందూ పరిషత (వీహెచపీ) ఆధ్వర్యంలో 2025 జనవరి 5న విజయవాడలో చేపట్టిన ‘హైందవ శంఖారావం’ భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని రాషీ్ట్రయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎ్‌సఎస్‌) రాష్ట్ర కార్యవాహకుడు వేణుగోపాల్‌ నాయుడు పిలుపునిచ్చారు.

‘హైందవ శంఖారావం కార్యక్రమాన్ని జయప్రదం చేయండి’
హైందవ శంఖారావం కార్యక్రమ కరపత్రం విడుదల చేస్తున్న ఆర్‌ఎ్‌సఎస్‌, వీహెచపీ నాయకులు

కర్నూలు కల్చరల్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోరుతూ విశ్వ హిందూ పరిషత (వీహెచపీ) ఆధ్వర్యంలో 2025 జనవరి 5న విజయవాడలో చేపట్టిన ‘హైందవ శంఖారావం’ భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని రాషీ్ట్రయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎ్‌సఎస్‌) రాష్ట్ర కార్యవాహకుడు వేణుగోపాల్‌ నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని రెవెన్యూ కాలనీలోగల వీహెచపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ దేశంలో అన్ని మతాలను సమానంగా చూడాలని రాజ్యాంగం ఇచ్చిన హక్కును కాలరాస్తూ గత భారత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందూ సమాజాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని అన్నారు. ప్రార్థన స్థలాలు, ఆస్తుల విషయంలో ఇతర మతాలకు ఇచ్చిన స్వేచ్ఛను అత్యధికంగా ఉండే హిందువుల దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణ ఉండడం తీవ్రమైన ఆక్షేపణీయమని అన్నారు. హిందూ దేవాలయాలపై ప్రభుత్వ ఆజమాయిషీ పూర్తిగా తొలగించే వరకు ఈ ఉద్యమం ఆగదని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలకంఠ, వీహెచపీ నాయకులు ప్రాణేష్‌, భానుప్రకాశ, వీహెచపీ హైందవ శంఖారావం కోకన్వీనర్‌ విష్ణువర్థనరెడ్డి, ఆర్‌ఎ్‌సఎస్‌ విభాగ్‌ కార్యవాహకుడు రఘేవీర్‌, జిల్లా సంఘచాలక్‌ ఎనవీఎ్‌స గుప్త, జిల్లా కార్యవాహకుడు చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2024 | 11:33 PM