ఐ అండ్ పీఆర్ కమిషనర్ విజయకుమార్‌రెడ్డిపై విజిలెన్స్ విచారణ!
ABN , Publish Date - Jul 11 , 2024 | 04:06 AM
సమాచార-పౌరసంబంధాల శాఖలో గత ఐదేళ్లలో జరిగిన అవకతవకలు, వాటిలో ఐ అండ్ పీఆర్ కమిషనర్ టి.విజయకుమార్‌రెడ్డి పాత్రపై విజిలెన్స్ విచారణ జరపాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఆయనకు సహకరించిన ఒకరిద్దరు అధికారులపైనా ఈ విచారణ జరగనుంది. గత ఐదేళ్లలో ఐ అండ్ పీఆర్ కార్యాలయాన్ని కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి వైసీపీ

ఆయనకు సహకరించిన అధికారులపైనా..
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ
అమరావతి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): సమాచార-పౌరసంబంధాల శాఖలో గత ఐదేళ్లలో జరిగిన అవకతవకలు, వాటిలో ఐ అండ్ పీఆర్ కమిషనర్ టి.విజయకుమార్‌రెడ్డి పాత్రపై విజిలెన్స్ విచారణ జరపాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఆయనకు సహకరించిన ఒకరిద్దరు అధికారులపైనా ఈ విచారణ జరగనుంది. గత ఐదేళ్లలో ఐ అండ్ పీఆర్ కార్యాలయాన్ని కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి వైసీపీ కార్యాలయంగా మార్చేశారు. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసు (ఐఐఎ్‌స)కు చెందిన ఆయన జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై వచ్చారు. నిబంధనలన్నీ తుంగలో తొక్కి జగన్ రోత పత్రికకు ప్రభుత్వ ప్రకటనల రూపంలో రూ.వందల కోట్లు దోచిపెట్టారు. తన శాఖ బడ్జెట్ ఖర్చు చేయడంలో కనీస ప్రమాణాలు కూడా పాటించలేదు. వందల సంఖ్యలో ఉద్యోగులను అనధికారికంగా నియమించుకున్నారు. బడ్జెట్‌కు మించి ఖర్చుచేశారని.. నిధులు దారి మళ్లించారని.. జగన్ రోతపత్రిక ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకుని భారీగా జీతాలు దోచిపెట్టారని జర్నలిస్టు సంఘాలు ఆయనపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. వైసీపీ సోషల్ మీడియా వర్కర్లను డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులుగా చూపిస్తూ రూ.వేల కోట్లు జీతాల కింద సమర్పించారని కూడా ఆరోపించాయి. వీటిని పరిశీలించిన ప్రభుత్వం వాస్తవాలు ఉన్నాయని భావించింది. ఒకట్రెండు రోజుల్లో విజిలెన్స్ విచారణకు ఆదేశించనున్నట్లు సమాచారం. వాస్తవానికి మళ్లీ జగనే అధికారంలోకి వస్తారని జగన్ కంటే విజయ్‌కుమార్‌రెడ్డే ఎక్కువగా నమ్మారు. అందుకే తన డిప్యుటేషన్ పొడిగించాలని ఎన్నికల ఫలితాలకు ముందు కేంద్రానికి లేఖ రాశారు. అయితే వైసీపీ ఘోరంగా ఓడిపోవడం.. ఇదే సమయంలో ఆయన డిప్యుటేషన్ జూన్ 9వ తేదీతో ముగిసిపోవడంతో తిరిగి మాతృశాఖకు వెళ్లిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అక్రమాలు తేలేవరకు ఆయన్ను ఇక్కడే ఉంచాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది.