పొట్టిపాడు నుంచే విజయవాడ తూర్పు బైపాస్!
ABN , Publish Date - Sep 30 , 2024 | 12:58 AM
విజయవాడ తూర్పు బైపాస్ డీపీఆర్ రావడంతో పొట్టిపాడు టోల్ ప్లాజా నుంచే విజయవాడ తూర్పు బైపాస్‌కు సంబంధించిన ప్రతిపాదనను కేంద్రానికి పంపించేందుకు జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్) అధికారులు రంగం సిద్ధం చేశారు. మరో వారం రోజుల్లో పంపించనున్నారు. తూర్పు బైపాస్‌కు సంబంధించి అలైన్‌మెంట్ విషయంలో కూడా పూర్తి స్పష్టత వచ్చింది.
తుది డీపీఆర్ రాకతో ఎన్‌హెచ్ నిర్ణయం
వారం రోజుల్లో కేంద్రానికి నివేదిక
కేంద్రం ఆమోదం తర్వాత టెండర్ల ప్రక్రియ
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): విజయవాడ తూర్పు బైపాస్ డీపీఆర్ రావడంతో పొట్టిపాడు టోల్ ప్లాజా నుంచే విజయవాడ తూర్పు బైపాస్‌కు సంబంధించిన ప్రతిపాదనను కేంద్రానికి పంపించేందుకు జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్) అధికారులు రంగం సిద్ధం చేశారు. మరో వారం రోజుల్లో పంపించనున్నారు. తూర్పు బైపాస్‌కు సంబంధించి అలైన్‌మెంట్ విషయంలో కూడా పూర్తి స్పష్టత వచ్చింది. పొట్టిపాడు టోల్‌ప్లాజా నుంచి కాకుండా చిన్న అవుటపల్లి ప్రస్తుత విజయవాడ వెస్ట్ బైపాస్‌కు అనుసంధానంగా తీసుకువెళ్లాలన్న ప్రతిపాదనలు కూడా ఇటీవల కాలంలో వచ్చాయి. తుది డీపీఆర్‌ను పరిశీలించిన క్రమంలోనే పొట్టిపాడు టోల్‌ప్లాజా నుంచి కాజ వరకు ప్రతిపాదిత మార్గాన్ని కేంద్రానికి నివేదించాలని నిర్ణయించినట్టుగా జాతీయ రహదారుల సంస్థ వర్గాలు చెబుతున్నాయి. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని పొట్టిపాడు టోల్‌ప్లాజాను ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. చిన్న అవుటపల్లి నుంచి అయితే ఎయిర్‌పోర్టుకు అత్యంత దగ్గరగా వస్తుంది. రన్‌వేకు దగ్గరగా బైపాస్ వెళ్లడం మంచిది కాదని భావించి.. కాస్త ఎగువకు తీసుకు వెళ్లేందుకు వీలుగా విజయవాడ తూర్పు బైపాస్‌ను చిన్న అవుటపల్లి నుంచి కాకుండా పొట్టిపాడు టోల్‌ప్లాజా నుంచి తీసుకు వెళ్లేందుకు నిశ్చయించింది. ఎన్‌హెచ్ అధికారుల నుంచి కేంద్ర ప్రభుత్వానికి దీనికి సంబంధించిన ప్రతిపాదన వెళ్లిన తర్వాత కేంద్రం ఆమోదించాక టెండర్లకు వెళ్లాల్సిందిగా ఎన్‌హెచ్ అధికారులు నిర్ణయించుకున్నారు.