Share News

విశాఖ టు సీలేరు.. సీప్లేన్‌ సేవలు..!

ABN , Publish Date - Nov 21 , 2024 | 04:43 AM

పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా విశాఖపట్నం నుంచి సీలేరు వరకు సీప్లేన్‌ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రతిపాదన మరోమారు తెరపైకి వచ్చింది.

విశాఖ టు సీలేరు.. సీప్లేన్‌ సేవలు..!

మరోమారు తెరపైకి ప్రతిపాదనలు

జలాశయాన్ని పరిశీలించిన తహసీల్దార్‌, ఇరిగేషన్‌ అధికారులు

సీలేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా), నవంబరు 20: పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా విశాఖపట్నం నుంచి సీలేరు వరకు సీప్లేన్‌ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రతిపాదన మరోమారు తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు.. గూడెంకొత్తవీధి తహసీల్దార్‌ రామకృష్ణ, ఇరిగేషన్‌ అధికారులతో కూడిన బృందం సీలేరు జలాశయాన్ని బుధవారం సందర్శించింది. మారెమ్మ ఆలయం ఎదురుగా ఉన్న స్నానాల ఘాట్‌, మొయిన్‌ డ్యామ్‌ను పరిశీలించింది. సీ ప్లేన్‌ ల్యాడింగ్‌కు, టేకా్‌ఫకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా..? లేదా..? అనే అంశాలను అధ్యయనం చేసింది. తహసీల్దార్‌ రామకృష్ణ మాట్లాడుతూ... విశాఖనుంచి సీలేరు వరకు సీప్లేన్‌ నడపాలని 2017లోనే ప్రతిపాదనలు వచ్చినప్పటికీ కార్యరూపం దాల్చలేదన్నారు. తాజాగా విజయవాడ నుంచి శ్రీశైలానికి సీప్లేన్‌ ట్రయల్‌ రన్‌ నిర్వహించడంతో ఈ అంశం తెరపైకి వచ్చిందన్నారు. ఈ క్రమంలోనే సీలేరు జలాశయాన్ని పరిశీలించామని, ఇది చాలా విశాలంగా, లోతుగా ఉందని చెప్పారు. సీప్లేన్‌ ల్యాండింగ్‌, టేకా్‌ఫకు అనుకూలమేనని కలెక్టర్‌కు నివేదిక ఇస్తామన్నారు. జలాపుట్‌ జలాశయంలోనూ సీప్లేన్‌ ప్రయాణానికి సిబ్బంది సర్వే నిర్వహించారన్నారు. సీప్లేన్‌ అందుబాటులోకి వస్తే సీలేరు, ధారాలమ్మ ఆలయం, రేయిన్‌గేజ్‌ వంటి ప్రాంతాలకు పర్యాటకుల రాక పెరుగుతుందన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 04:44 AM