VIT University : బాధితులకు వీఐటీ విరాళం
ABN , Publish Date - Sep 07 , 2024 | 04:24 AM
వరద భాదితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి 1,57,50,000 విరాళాన్ని వీఐటీ విశ్వవిద్యాలయం అందజేసింది.
తుళ్లూరు, సెప్టెంబరు 6: వరద భాదితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి 1,57,50,000 విరాళాన్ని వీఐటీ విశ్వవిద్యాలయం అందజేసింది. శుక్రవారం విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలసి వీఐటీ వ్యవస్థాపకులు జీ.విశ్వనాధన్, వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్ అందజేశారు. ఇందులో వీఐటీ విశ్వవిద్యాలయం ద్వారా రూ.1,50,00,000 వీఐటీ అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థులు కలసి రూ.7,50,000 అందించారు.