Share News

గండం గట్టెక్కేనా!

ABN , Publish Date - Dec 24 , 2024 | 01:07 AM

ఏటా నిర్వహించాలనుకుంటున్న డెల్టా ఆధునికీకరణ పనులు గడిచిన ఐదేళ్ళల్లో అంతా తూచ్‌. ఎక్కడా తట్ట మట్టి తీసిన పాపాన పోలేదు. రైతుల గోస వింటే ఒట్టు. అంతలా మాయ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వైసీపీ ప్రభుత్వం మాదిరిగానే చూసీచూడనట్టుగా వ్యవహరిస్తుం దా.. లేకుంటే కాల్వల ఆధునికీకరణ పనుల మీద దృష్టి పెట్టబోతున్నా రా..? అన్న దానిపై నిర్దిష్ట ప్రణాళిక లేకుండా పోయింది.

 గండం గట్టెక్కేనా!

రబీలో సాగునీటికి కటకట తప్పదా..

ఈ సీజన్‌లో గోదావరి నీటి లభ్యత 23 టీఎంసీల కొరత

ఇంకోవైపు కాల్వల ఆధునికీ కరణకు కార్యాచరణ లేదు

నిర్ధిష్ట పనులపైనా ఎవరికీ పట్టలేదు

తాగునీటికి ముందుంది గండమే

ఇప్పటికే జల్‌ జీవన్‌ మిషన్‌ పడకేసింది

పక్కా వేసవి ప్రణాళికకు సన్నాహాలు లేవు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :

ఏటా నిర్వహించాలనుకుంటున్న డెల్టా ఆధునికీకరణ పనులు గడిచిన ఐదేళ్ళల్లో అంతా తూచ్‌. ఎక్కడా తట్ట మట్టి తీసిన పాపాన పోలేదు. రైతుల గోస వింటే ఒట్టు. అంతలా మాయ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వైసీపీ ప్రభుత్వం మాదిరిగానే చూసీచూడనట్టుగా వ్యవహరిస్తుం దా.. లేకుంటే కాల్వల ఆధునికీకరణ పనుల మీద దృష్టి పెట్టబోతున్నా రా..? అన్న దానిపై నిర్దిష్ట ప్రణాళిక లేకుండా పోయింది. గత అనుభవా లను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా మేల్కొనాలన్న తాపత్రయం అటు అధికార యంత్రాంగంలో, ఇటు ఎమ్మెల్యేల్లోను కొంత కొరవడింది. ఇదే జరిగితే అటు సాగునీరు, ఇటు తాగునీరు గండం ఈసారి గట్టెక్కు తుందా అనేది అనుమానమే.

కూటమి ప్రభుత్వానికి వచ్చే వేసవి అగ్ని పరీక్షే. ముందస్తు కార్యాచరణతో మేల్కొంటే తప్ప గండం గట్టెక్కడం కష్టమే. ఇప్పటికే చలికాలంలోనే ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా నమోద వుతుండగా అదే వచ్చే వేసవిలో ఇంకెలా ఉండబోతున్నాయనే అంచనాలు లేకపోలేదు. ప్రతీసారి రబీని దృష్టిలో పెట్టుకుని సాగునీటి సరఫరా, వచ్చే ఖరీఫ్‌ను దృష్టిలో పెట్టుకుని కాల్వల ఆధునికీకరణ పనులకు ప్రత్యేక కార్యా చరణ సిద్ధం చేస్తారు. ఏటా ఇదే నెలలో జరిగే సాగునీటి సలహా మండలి సమావేశంలోను నిర్ధిష్ట పనులు చేసేందుకు ప్రణాళిక రూపొం దిస్తారు. రైతుల నుంచి సూచనలు స్వీకరించి ఆ దిశగా ముందడుగు వేస్తారు. ఈ మధ్యనే సాగునీటి సలహా మండలి సమావేశం అర కొరగా సాగింది. వచ్చే రబీలో సాగునీటికి ఎదురయ్యే అడ్డంకులను, అవాంతరాలను ఎలా పరిష్కరించవచ్చో నిర్దిష్ట సలహాలను ఇవ్వలేకపోయారు. అధికారులు సైతం ముందస్తు నివేదికలతో హాజరు కాలేక పోయారు. ప్రత్యేకించి జిల్లాలోని రైతులు ఆశించినట్టుగా కొన్ని పనులపైనా నామ మాత్రపు చర్యలకైనా ప్రణాళిక రూపొందించలేకపోయారు.

వ్యవసాయ ఆధారిత జిల్లాలో గడిచిన ఐదేళ్ళు ముందుచూపు కొరవడడంతో కాల్వల కింద రైతులు కొంతమేర నష్టపోయారు. రెండో పంటకు తగినంత సాగునీరు లభించక, శివా రు భూములకు నీరందక తంటాలు పడ్డారు. గతేడాది ఎదురైన అనుభవాల నుంచి ఈసారి కూడా గుణపాఠం నేర్చుకున్నట్టుగా కనిపించ డమేలేదు. వాస్తవానికి ఏటా ఇదే నెలలో కాల్వల ఆధునికీకరణ పనులు ఏవేమి చేయా లి, ఎప్పటిలోపు పూర్తి చేయాలో దిశ, నిర్దేశం చేసేవారు. వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వం కేటా యించిన నిధులను బట్టి ఆ మేరకు పనులపై పక్కా ప్రణాళిక ఉండేది. డిసెంబరులో నిర్ణయాలు తీసుకుని జనవరి మాసాంతం ఫిబ్రవరి మొదటి వారంకల్లా పనుల టెండర్ల ఖరారుకు స్కెచ్‌ వేసేవారు. ఆ పరిధిలోనే పనులు సాగాలని షరతు పెట్టేవారు. ఇదంతా 2014–19 మధ్యనే సాధ్యమైంది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ళలో కాల్వల ఆధునికీకరణ పనులను పక్కన పడేసింది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓట్‌ ఆన్‌ అకౌంట్‌గా కొంతమేర నిధులు కేటాయించినా ఈ వేసవిలోను ఏపనులు జరగలేదు. రైతులు ఎదుర్కొం టున్న కష్టనష్టాలు గురించి ఆనాటి ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం నోరు మెదప లేదు. ఎర్ర కాల్వ ఆధునికీకరణ పనులు పక్కనపడేశారు. కృష్ణకాల్వ నిర్వహణ పనుల ను చేపట్టకుండా గాలికొదిలేశారు. దీనికి తగ్గ ట్టుగానే తాగునీటి విషయంలోను ఇదే నిర్లక్ష్యం గతంలో కొన సాగింది. ఏలూరు నగరానికి పంపులచెరువు నుంచి వచ్చిన తాగునీరే ఆధా రం. ఈ నీరంతా కృష్ణ కాల్వ ద్వారా పంపుల చెరువుకు చేరు తుంది. అటువంటి ప్రాధాన్యత కలిగిన కాల్వ పూడిక, పిచ్చి మొక్కలతో నిండి పోయినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఫిబ్రవరిలోపు తాగునీటి సరఫరాపై ప్రణాళిక సిద్ధం చేసే వారు. దానికి ముందస్తుగా నియో జకవర్గాల నుంచి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కొరత లేకుండా తీర్చేందుకు సిద్ధప డేవారు. ఇలాంటి ప్రణాళికకు ఇప్పటివరకు ఎలాంటి సన్నాహాలు లేనేలేవు.

ముందున్నది కష్టకాలమే..

కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి ఆరు నెలలు గడుస్తోంది. గత అను భవాలను పరిగణనలోకి తీసుకుని వచ్చే వేసవి సీజన్‌లో అధిగమించేందుకు యంత్రాం గంలో ఇంకా స్తబ్దత తొలగిపోలేదు. వాస్తవా నికి డిసెంబరులో ప్రణాళిక ఆరంభిస్తేనేగాని కాల్వలు తెరిచే జూన్‌ ఒకటో తేదీకి పనులు పూర్తికావు. టెండర్ల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే లక్షల్లో పెండింగ్‌లో ఉన్న బిల్లులు రాక కాంట్రాక్టర్లు నిరుత్సాహపడి ఉన్న తరుణంలో కొత్త టెండర్లు పిలిచినా ఎంతమంది పాల్గొంటా రనేది అనుమానమే. ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని ఆయా వర్గాలను సమాయత్త పర్చాలి. కాని ప్రణాళికే సిద్ధం కాలేదు. ఈ రబీ సీజన్‌లో గోదావరి నీటి లభ్యత 23 టీఎంసీలు మేర తక్కువగా ఉండబోతుందని అంచనా. అంతకంటే మించి మరింత క్షీణ దశకు చేరుకుంటే సీలేరు నుంచి రప్పించే జలాలు ఏ మూలకూ సరిపోవనేది రైతుల వాదన. దీని ప్రభావమే కాల్వల వెంబడి ఉన్న గ్రామాలపైన తాగునీటి ప్రభావం పడుతుంది. ఇప్పటికే ఇంటింటికి కుళాయి పేరిట జల్‌ జీవన్‌ మిషన్‌ అమలు చేయాల్సింది పోయి వైసీపీ ప్రభుత్వం అనుసరించిన నిర్లక్ష్యం జిల్లా ప్రజలకు శాపం కాబోతుంది. ఇంతకు ముందు ప్రతిపాదించిన జల్‌జీవన్‌ మిషన్‌ పనులను ఇంకోసారి రివైజ్‌ చేసేందుకు కేంద్రం సంకల్పించడంతో ఈసారి వేసవిలో దీని అమలుకు ఎలాంటి చర్యలకు దిగబోతు న్నారో ఇప్పటికీ సంబంధిత శాఖలు కనీసం సమీక్షించలేకపోయాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.454 కోట్లు మంజూరు కాగా కేవలం రూ.90 కోట్లే ఖర్చు చేశారు. ఏలూరు నగరంతో పాటు గతంలో అనేక గ్రామాలు తాగునీటి ఎద్దడి ఎదుర్కొన్నాయి. ఫిబ్రవరిలోపే నిర్ధిష్ట కార్యాచరణ ఆరంభించా ల్సింది ఉంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి సమస్య రాదన్న ధీమాతోనే యంత్రాంగం ఉన్నట్టుంది. ఎమ్మెల్యేల్లో కొంతమంది సీని యర్లు ఉండగా మరికొందరు జూనియర్లు. ఈ నేపథ్యంలో అధికారులే చొరవ తీసుకుని నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే సమక్షంలో సమీక్షలు చేస్తే కొంతలో కొంత వాస్తవాలు బహిర్గతమై చర్యలకు అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో కాలయాపన లేకుండా కార్యాచరణకు దిగుతారా, లేకుంటే గతంలో మాదిరిగానే గండం ముంచుకొచ్చినా పట్టనట్టుంటారా అనేది అందరి అనుమానం.

Updated Date - Dec 24 , 2024 | 01:07 AM