Share News

మనమంతా ఒకే కుటుంబం.. ధైర్యంగా ఉండండి

ABN , Publish Date - Feb 08 , 2024 | 03:56 AM

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో కలత చెంది మరణించిన పల్నాడు జిల్లాలోని 5 కుటుంబాలను నారా భువనేశ్వరి బుధవారం పరామర్శించారు. మనమంతా ఒకే కుటుంబం.

మనమంతా ఒకే కుటుంబం.. ధైర్యంగా ఉండండి

పల్నాడులో భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర

నరసరావుపేట, ఫిబ్రవరి 7: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో కలత చెంది మరణించిన పల్నాడు జిల్లాలోని 5 కుటుంబాలను నారా భువనేశ్వరి బుధవారం పరామర్శించారు. మనమంతా ఒకే కుటుంబం.. ధైర్యంగా ఉండండి.. పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. నిజం గెలవాలి పేరుతో యాత్ర చేపట్టిన భువనేశ్వ రి బుధవారం చిలకలూరిపేట, నరసరావుపేట నియోజకవర్గాల్లో పర్యటించారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక యడ్లపాడు ఎస్టీ కాలనీలో మరణించిన మొగిలి సత్యనారాయణ, నరసరావుపేట మండలం ములకలూరులోని షేక్‌ సైదా, పాలపాడులోని కొలికొండ ఆంజనేయులు, రొంపిచర్ల మండలం అన్నవరంలో ఉదయ్‌శేఖర్‌, చిన్న బిక్షాలు కుటుంబాలను పరామర్శించారు.

Updated Date - Feb 08 , 2024 | 07:01 AM