ఉపాధి అవకాశాలు కల్పిస్తాం
ABN , Publish Date - Dec 11 , 2024 | 12:28 AM
నిరుద్యోగ యువతీ, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని టీడీపీ డోన నాయకురా లు కోట్ల చిత్రమ్మ అన్నారు.
బేతంచెర్ల, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతీ, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని టీడీపీ డోన నాయకురా లు కోట్ల చిత్రమ్మ అన్నారు. మంగళవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతి థి గృహంలో వివిధ గ్రామాలు, పట్టణ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డోన మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, నాయకురాలు కోట్ల చిత్రమ్మ పా ల్గొని మాట్లాడారు. కొంతమంది మహిళలు ఇళ్ల వద్దనే ఉంటూ జూట్ బ్యాగులను తయారు చేస్తున్నారని, వాటికి మార్కెటింగ్ కూడా కల్పిం చేందుకు కృషి చేస్తామన్నారు. నిరుద్యోగ మహిళలకు వివిధ కంపెనీల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు అనురాధ, మహిళలు ఉన్నారు.