అప్పనంగా అప్పగించేస్తారా?
ABN , Publish Date - Feb 13 , 2024 | 02:21 AM
గత ప్రభుత్వం క్రీడా శిక్షణ కేంద్రం ఏర్పాటు కోసం కేటయించిన స్థలాన్ని సినీ దర్శకుడు మహి వీ రాఘవకు అప్పనంగా అప్పగించడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు.
హార్సిలీ హిల్స్‌లో ‘యాత్ర’ దర్శకునికి కేటాయింపులపై రామకృష్ణ విమర్శ
అమరావతి(ఆంధ్రజ్యోతి), అనంతపురం, ఫిబ్రవరి 12: గత ప్రభుత్వం క్రీడా శిక్షణ కేంద్రం ఏర్పాటు కోసం కేటయించిన స్థలాన్ని సినీ దర్శకుడు మహి వీ రాఘవకు అప్పనంగా అప్పగించడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు. ‘‘దర్శకుడు మహి ‘యాత్ర 2’ పేరుతో తనకు సొంత డబ్బా కొట్టాడని హార్స్‌లీ హిల్స్‌లో రూ.20 కోట్ల భూమిని సీఎం జగన్ ఎలా కట్టబెడతారు? భూ కేటాయింపులను తక్షణమే ఉపసంహరించుకోవాలి’’ అని ఆయన సోమవారం డిమాండ్ చేశారు. కాగా, ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ, ‘బీజేపీ రాజకీయాలపై ఈ నెల 20న విజయవాడలో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో సదస్సు ఏర్పాటు చేస్తాం’ అని తెలిపారు.