Share News

మహిళపై వీధికుక్కల దాడి

ABN , Publish Date - Dec 27 , 2024 | 11:57 PM

మండలం లోని బడన్నపల్లిలో శుక్ర వారం సాయంత్రం వీధి కుక్కలు ఓ మహిళపై దాడి చేసి.. తీవ్రంగా గాయపర్చాయి.

మహిళపై వీధికుక్కల దాడి
గాయపడిన సాలమ్మ

ధర్మవరంరూరల్‌, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): మండలం లోని బడన్నపల్లిలో శుక్ర వారం సాయంత్రం వీధి కుక్కలు ఓ మహిళపై దాడి చేసి.. తీవ్రంగా గాయపర్చాయి. ఎజ్జే సాలమ్మ అనే మహిళ తన మనవడితో ఇంటి బయట ఉండగా వీధి కుక్కలు వేగంగా వచ్చి ఆమె కాలివేళ్లను కరిచి తీ వ్రంగా గాయపరిచాయి. దీంతో ఆమె కాలికి తీవ్ర గాయమైంది. కు టుంబసభ్యులు హుటా హుటినా ధర్మవరం ప్రభుత్వా సుపత్రికి తరలించారు. గతం లోనూ గ్రామంలో వీధి, పెంపుడు కుక్కలు పలుమార్లు మహిళలు , పిల్లలపై దాడులు చేశామని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వీధికుక్కల బెడద నుంచి రక్షించాలని కోరారు.

Updated Date - Dec 27 , 2024 | 11:59 PM