Share News

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల భేటీ.. అమరావతి నిర్మాణంపై చర్చ

ABN , Publish Date - Aug 12 , 2024 | 09:41 PM

ప్రపంచ బ్యాంక్(World Bank) ప్రతినిధులతో సీఎం చంద్రబాబుతో(CM Chandrababu) సోమవారం భేటీ అయ్యారు. వీరు రాజధాని అమరావతి(Amaravathi) నిర్మాణంపై ముఖ్యమంత్రితో మాట్లాడారు.

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల భేటీ.. అమరావతి నిర్మాణంపై చర్చ

అమరావతి: ప్రపంచ బ్యాంక్(World Bank) ప్రతినిధులతో సీఎం చంద్రబాబుతో(CM Chandrababu) సోమవారం భేటీ అయ్యారు. వీరు రాజధాని అమరావతి(Amaravathi) నిర్మాణంపై ముఖ్యమంత్రితో మాట్లాడారు. నలుగురు సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం రెండు రోజులుగా అమరావతిలో పర్యటిస్తోంది. ఈ బృందంలో వరల్డ్ బ్యాంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సీనియర్ స్పెషలిస్ట్ రఘు కేశవన్, లీడ్ ట్రాన్స్‌పోర్ట్ స్పెషలిస్ట్ గెరాల్డ్ పాల్ అలీవియర్, సీనియర్ అర్బన్ స్పెషలిస్ట్ కింగ్ యున్ షెన్, సౌత్ ఏషియా అర్బన్ ప్రాక్టీస్ మేనేజర్ అబేదాలిరజాక్ ఎఫ్.ఖలీల్ ఉన్నారు.

మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం ప్రపంచ బ్యాంకు బృందం విజయవాడ వచ్చింది. వారు మధ్యాహ్నం వరకూ విజయవాడ సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో అధికారులతో భేటీ అయ్యారు. అనంతరం సీఆర్డీయే, అమరావతి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులు ప్రపంచ బ్యాంకు బృందానికి వివరించారు. సీఎం చంద్రబాబు ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి నిర్మాణంలో ఎలా ముందుకెళ్తుందనేదానిపై వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులకు వివరించారు. ప్రపంచంలోని ఉత్తమ ప్రమాణాలు, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని అమరావతి నిర్మాణం చేపడుతున్నట్లు సీఎం వారికి వివరించారు.

CM Chandrababu: పారిశ్రామిక పాలసీ రూపకల్పనపై చంద్రబాబు సమీక్ష..

Updated Date - Aug 12 , 2024 | 09:41 PM