Share News

టీడీపీలోకి వైసీపీ కార్పొరేటర్లు, నేతలు

ABN , Publish Date - Oct 22 , 2024 | 01:02 AM

జగన్‌ పాలన ప్రజలకే కాదు వైసీపీ నేతలు, కార్యకర్తలకు కూడా విసుగెత్తించిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) అన్నారు.

టీడీపీలోకి వైసీపీ కార్పొరేటర్లు, నేతలు

వన్‌టౌన్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): జగన్‌ పాలన ప్రజలకే కాదు వైసీపీ నేతలు, కార్యకర్తలకు కూడా విసుగెత్తించిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) అన్నారు. ఎమ్మెల్యే బొం డా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో 29 వ డివిజన్‌ కార్పొరేటర్‌ లక్ష్మీపతి, 61వ డి విజన్‌ కార్పొరేటర్‌ రమాదేవి, 63వ డివిజ న్‌ కార్పొరేటర్‌ మోదుగుల తిరుపతమ్మ సోమవారం తమ అనుచరులతో కలిసి గు రునానక్‌ కాలనీలోని ఎన్టీఆర్‌ భవన్‌లో ఎంపీ శివనాథ్‌ సమక్షంలో టీడీపీలో చేరా రు. వీరికి ఎమ్మెల్యే బొండా ఉమతో కలిసి శివనాథ్‌ పార్టీ కండువాలు కప్పి సాదరం గా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ వరదల సమయంలో చం ద్రబాబు - వైసీపీ ఎమ్మెల్యే జగన్‌ వ్యవహారశైలి వైసీపీ నేతలు, కార్యకర్తలు గుర్తించారని, చంద్రబాబు నాయకత్వంలోనే ప్రజలకు మంచి జరుగుతుందని భావించారన్నారు. సెంట్రల్‌లోని వరద ముంపు ప్రాం తాలకు చెందిన ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు ఆ పార్టీని వీడి టీడీపీలోకి రావటం సంతోషదాయకమన్నారు. ఎమ్మెల్యే బొం డా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విపత్తును ఎదుర్కొని చంద్రబాబు ప్రజల ను కాపాడిన తీరు, ఆయన సేవలు ఎంతో ఆదర్శమన్నారు. వైసీపీ నేతలు, చంద్రబా బు సేవలను మెచ్చుకుంటున్నారని, టీడీపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. వైసీపీ నుంచి వచ్చే వారందరినీ పార్టీలోకి చేర్చుకోబోమని, ప్రజా సేవ పట్ల అంకితభావం ఉన్నవారినే చేర్చుకుంటామని స్పష్టం చేశారు. బొప్పన భవకుమార్‌, మాగంటి నరసింహ చౌదరి, సెంట్రల్‌ కో-ఆర్డినేటర్‌ నవనీతం సాంబశివరావు, కార్పొరేటర్‌ చెన్నుపాటి ఉషారాణి, సొంగా సంజయ్‌ వర్మ, టీడీపీ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ ఎర్రుబోతు రమణ పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 01:02 AM