విజయరాయిలో రెచ్చిపోయిన వైసీపీ గూండాలు
ABN , Publish Date - May 03 , 2024 | 06:02 AM
ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయిలో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా గురువారం రాత్రి పది గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన వైసీపీకి చెందిన యువకులు 20 మంది ప్రచారానికి అడ్డుగా వచ్చి టీడీపీ శ్రేణులపై దాడికి పాల్పడ్డారు.
ప్రచారానికి అడ్డువచ్చి టీడీపీ వర్గీయులపై దాడి
పర్వతనేని ప్రభాకర్ తలకు తీవ్ర గాయం.. మరికొందరికీ గాయాలు
పెదవేగి, మే 2 : ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయిలో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా గురువారం రాత్రి పది గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన వైసీపీకి చెందిన యువకులు 20 మంది ప్రచారానికి అడ్డుగా వచ్చి టీడీపీ శ్రేణులపై దాడికి పాల్పడ్డారు.
టీడీపీకి చెందిన పర్వతనేని ప్రభాకర్ తలకు తీవ్రగాయమైంది. మరి కొంతమందికి గాయాలయ్యాయి. మా వీధిలోకి ప్రచారానికి రావడానికి వీలు లేదంటూ అడ్డుకోవడమే గొడవకు కారణంగా తెలుస్తోంది. వైసీపీ నాయకుడు మట్టా రమాశంకర్ తదితరులు రాడ్లు, కర్రలతో దాడి చేశారు.
క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడినవారిని అరెస్టు చేయాలని చింతమనేని ధర్నా నిర్వహించారు. చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ప్రభుత్వాసుపత్రిలో బాధితులను చింతమనేని పరామర్శించారు.
టీడీపీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్త కత్తితో దాడి..
మండవల్లి మే 2 : ఏలూరు జిల్లా మండవల్లి మండలం పెరికేగూడెంలో టీడీపీ కార్యకర్తపై గురువారం రాత్రి వైసీపీ కార్యకర్తలు కమ్మ కత్తితో దాడి చేశారు. పెరికేగూడెంలో రేషన్ డీలర్ భర్త పెరుమాళ్ల రమేష్ బీజేపీలో చురుగ్గా తిరుగుతున్నాడు.
వైసీపీకి చెందిన కుంచె నాగయ్య, అతని కుమారుడు చక్రి గురువారం రాత్రి రమేష్ ఇంటికి వెళ్లి బీజేపీలో తిరగడానికి వెళ్లవద్దంటూ కత్తితో దాడి చేశారు. రమేష్ అర చేతికి తీవ్రగాయమైంది. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.