Share News

ratham incident రథానికి నిప్పు పెట్టింది వైసీపీ నాయకుడే

ABN , Publish Date - Sep 25 , 2024 | 11:24 PM

కణేకల్లు మండలం హననకనహాళ్‌ గ్రామంలో రాములోరి రథానికి నిప్పంటించిన ఘటనలో వైసీపీ నాయకుడు బోడిమల్ల ఈశ్వర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను ఎస్పీ జగదీష్‌ బుధవారం విలేకరులకు తెలిపారు. రాములోరి రథాన్ని 2022లో అదే గ్రామానికి చెందిన ఎర్రిస్వామిరెడ్డి సోదరులు రూ.20లక్షలు వెచ్చించి తయారు చేయించారని అన్నారు.

ratham incident రథానికి నిప్పు పెట్టింది వైసీపీ నాయకుడే
అరెస్ట్‌ వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ జగదీష్‌

అరెస్టు చేసిన పోలీసులు

అనంతపురం క్రైం, సెప్టెంబరు 25: కణేకల్లు మండలం హననకనహాళ్‌ గ్రామంలో రాములోరి రథానికి నిప్పంటించిన ఘటనలో వైసీపీ నాయకుడు బోడిమల్ల ఈశ్వర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను ఎస్పీ జగదీష్‌ బుధవారం విలేకరులకు తెలిపారు. రాములోరి రథాన్ని 2022లో అదే గ్రామానికి చెందిన ఎర్రిస్వామిరెడ్డి సోదరులు రూ.20లక్షలు వెచ్చించి తయారు చేయించారని అన్నారు. రథం తయారీకి వారు గ్రామంలో ఎవరి సహాయసహకారాలు, చందాలు తీసుకోలేదని, దీంతో గ్రామస్థుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయని తెలిపారు. ఈ క్రమంలో ఈ నెల 23న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రథాన్ని భద్రపరిచిన మండపం తాళాలు పగులగొట్టి అందులో ప్రవేశించారని, అనంతరం రథానికి నిప్పు పెట్టారని తెలిపారు. మంటలు ఎగిసి పడటాన్ని మండపం సమీపంలోని ఇళ్ల వారు గమనించి అక్కడికి వచ్చి ఆర్పివేశారని తెలిపారు. రథం తయారీలో తమ సహకారం తీసుకోలేదనే అక్కసుతోనే గ్రామానికి చెందిన ఈశ్వర్‌రెడ్డి ఈ ఘటనకు పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఐదారుగురిని విచారించామని, ఈశ్వర్‌రెడ్డిని రిమాండ్‌కు పంపుతామని తెలిపారు.

Updated Date - Sep 25 , 2024 | 11:24 PM