వైసీపీ ఆరోపణలు నిరాధారం
ABN , Publish Date - Oct 10 , 2024 | 03:18 AM
విజయవాడలో వరద బాధితుల కోసం వచ్చిన విరాళాలు దుర్వినియోగం చేశారంటూ వైసీపీ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.
విరాళాలు, సాయంలో అవినీతికి ఆస్కారమే లేదు : ప్రభుత్వం
అమరావతి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): విజయవాడలో వరద బాధితుల కోసం వచ్చిన విరాళాలు దుర్వినియోగం చేశారంటూ వైసీపీ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ‘వరద సాయంలో ఎలాంటి అవినీతి జరగలేదు. ఇలాంటి అసత్యప్రచారాలను ప్రజలు విశ్వసించకుండా, అప్రమత్తంగా ఉండాలి’ అని సూచించింది. ‘విజయవాడలో 32 వార్డులతో సహా 2సమీప గ్రామాల్లో సర్వస్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు దాతలు చేయూతనిచ్చారు. నిధులు దుర్వినియోగం కాకుండా.. వరద ముంపు వార్డులకు సీనియర్ ఐఏఎ్‌సలను ప్రత్యేక అధికారులుగా నియమించాం. 3 వారాల్లోగా బాధిత కుటుంబాలకు డీబీటీ ద్వారా పరిహారం పంపిణీ చేశాం. 4,06,059 మందికి ఆర్థిక సహాయం అందించడానికి రూ.602 కోట్లు వెచ్చించాం. గ్రీవెన్స్ ద్వారా ఎన్టీఆర్ జిల్లాలో 10,000, కృష్ణా జిల్లాలో 1,130, అల్లూరి జిల్లాలో 3,237, బాపట్ల జిల్లాలో 821 ఫిర్యాదులు అందాయి. వాటిని పరిష్కరించి చెల్లింపులు జరిపా రు. ఇతర ఖర్చుల కోసం జిల్లాలకు టీఆర్ 27 కింద రూ.149 కోట్లు విడుదల చేయగా, ఎన్టీఆర్ జిల్లాకు రూ.88 కోట్లు విడుదల చేశాం. ఆహార అవసరాలకు రూ.368 కోట్లు, తాగునీటికి రూ.26 కోట్లు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లు ఖర్చు చేశారన్న ఆరోపణలు నిరాధారం. ఎన్టీఆర్ జిల్లాలో సహాయ చర్యల ఖర్చు రూ.139.44 కోట్లు. తాత్కాలిక వసతికి రూ.8.42 కోట్లు, ఆహారానికి రూ.92.51 కోట్లు, తాగునీటికి రూ.11.22 కోట్లు, మెడికల్ కేర్‌కు రూ.4.55 కోట్లు, శానిటేషన్, పునరావాస సౌకర్యాలకు రూ.20.56 కోట్లు, ఉపశమన వస్తువులకు రూ.1.95 కోట్లు, విద్యుత్, జనరేటర్లు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.0.23 కోట్లు ఖర్చు చేశాం’ అని ప్రభుత్వం ప్రకటించింది.