Share News

మొక్క మొక్కకో ఎల్‌ఈడీ!

ABN , Publish Date - Dec 20 , 2024 | 05:47 AM

పొందికగా అమర్చిన మొక్కలు... వాటిపై వెలుగు పడేలా అమర్చిన ఎల్‌ఈడీ లైట్లు... చామంతి పూల సాగులో ఓ యువ రైతు చేస్తున్న కృషికి ప్రత్యక్ష నిదర్శనం ఈ చిత్రాలు.

మొక్క మొక్కకో ఎల్‌ఈడీ!

పొందికగా అమర్చిన మొక్కలు... వాటిపై వెలుగు పడేలా అమర్చిన ఎల్‌ఈడీ లైట్లు... చామంతి పూల సాగులో ఓ యువ రైతు చేస్తున్న కృషికి ప్రత్యక్ష నిదర్శనం ఈ చిత్రాలు. అన్నమయ్య జిల్లా పెదమాండ్యం కలిచెర్ల గ్రామానికి చెందిన యువరైతు షేక్‌ అబ్దుల్లా.. అగ్రికల్చర్‌ బీఎస్సీ చదివి వ్యవసాయంపై ఆసక్తితో ఐదు ఎకరాల భూమిలో చామంతి పూల సాగు చేపట్టారు. తోటలో రెండు అడుగులకో ఎల్‌ఈడీ లైట్‌ ఏర్పాటు చేశారు. సాయంత్రం కాగానే ఈ ఎల్‌ఈడీ వెలుగుల్లో చామంతి తోటంతా ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

Updated Date - Dec 20 , 2024 | 05:47 AM