Share News

YS Jagan: రేపు అచ్యుతాపురానికి వైఎస్ జగన్.. బాధితులకు పరామర్శ

ABN , Publish Date - Aug 22 , 2024 | 09:39 PM

అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్‌డ్ లైఫ్ సైన్సెస్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను, క్షతగాత్రులను పరామర్శించాలని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్(Jagan) నిర్ణయించారు.

YS Jagan: రేపు అచ్యుతాపురానికి వైఎస్ జగన్.. బాధితులకు పరామర్శ

అమరావతి: అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్‌డ్ లైఫ్ సైన్సెస్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను, క్షతగాత్రులను పరామర్శించాలని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్(Jagan) నిర్ణయించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విశాఖపట్నానికి రానున్నారు. అచ్యుతాపురం ఘటనలో గాయపడి, అనకాపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఉ.11 గంటలకు పరామర్శించనున్నారు.

ఉ.8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఉ.10కి ఆయన విశాఖ చేరుకుంటారని వైసీపీ తెలిపింది. అక్కడి నుంచి నేరుగా అనకాపల్లి చేరుకుని క్షతగాత్రులను పరామర్శిస్తారని పేర్కొంది. ప్రభుత్వం రూ.కోటి పరిహారం ప్రకటించాలని వైఎస్ జగన్ ఇదివరకే డిమాండ్ చేశారు. రేపు మీడియా ముందుకు వచ్చి ఇదే అంశంపై మాట్లాడే అవకాశం ఉంది.


థర్డ్ పార్టీ నివేదికలో కీలక అంశాలు..

అచ్యుతాపురం ఘటనలో థర్డ్ పార్టీ కీలక నివేదికను వెలువరించింది. ఈ ప్రమాదం వెనుక యాజమాన్యం, అధికారుల నిర్లక్ష్యం ఉందని థర్డ్ పార్టీ పేర్కొంది. గత ఏడాది ఇచ్చిన నివేదికలోనే సంస్థలో లోపాలను థర్డ్ పార్టీ నివేదిక ఎత్తి చూపించింది. పైప్ లైన్‌ను తరచూ తనిఖీ చేసే సిస్టమ్ వెంటనే ఫ్యాక్టరీలో ఏర్పాటు చేయాలని థర్డ్ పార్టీ నివేదిక గతంలోనే పేర్కొంది. అయినా సరే.. ఫ్యాక్టరీ యాజమాన్యం పట్టించుకోలేదు.

నివేదికను అమలు చేయాలని కనీసం ఫ్యాక్టరీ యాజమాన్యానికి సైతం ప్రభుత్వ అధికారులు చెప్పలేదని తెలుస్తోంది. పైప్‌లైన్ నుంచి బుధవారం మధ్యాహ్నం సాల్వెంట్ లీక్ అయ్యింది. ఫ్యాక్టరీలోని మొత్తం పైప్‌లైన్ నుంచి సాల్వెంట్ లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కొందరి శరీర భాగాలు కంపెనీ బయట ఉన్న చెట్లపై పడటంతో అక్కడంతా భయానక వాతావరణం కనిపించింది.

Updated Date - Aug 22 , 2024 | 09:43 PM