‘పెన్షన్ ఆలస్యం.. ప్రభుత్వ కుట్ర’
ABN , Publish Date - Mar 31 , 2024 | 05:57 PM
ప్రజలకు పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి వాలంటీర్లను దూరంగా పెట్టాలని ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1వ తేదీ వచ్చేసింది. అటువంటి పరిస్థితుల్లో ప్రజలకు మరో మార్గం ద్వారా పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి.
అమరావతి, మార్చి31: ప్రజలకు పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి వాలంటీర్లను దూరంగా పెట్టాలని ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1వ తేదీ వచ్చేసింది. అటువంటి పరిస్థితుల్లో ప్రజలకు మరో మార్గం ద్వారా పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి.
ఆ క్రమంలో ఇదే అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహరెడ్డికి ఏపీ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల (YS Sharmila) ఫోన్ చేసి.. పెన్షన్ పంపిణీకి వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్జప్తి చేశారు. అందుకు ఆయన సమాధానం ఇస్తూ... పెన్షన్ పంపిణీకి 10 రోజులు పడుతుందని సమాధానం ఇచ్చారు. దీంతో వైయస్ షర్మిల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ... రెండు, మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రజలకు పెన్షన్ పంపిణీ జరగకుంటే మీ కార్యాలయం ముందే ఆందోళనకు దిగుతామని జవహర్ రెడ్డిని హెచ్చరించారు.
వాలంటీర్ వ్యవస్థ లేకుంటే పెన్షన్ పంపిణీ చేయలేరా?.. ఇతర ప్రభుత్వ ఉద్యోగులు లేరా? అంటూ సీఎస్‌పై వైయస్ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వ యంత్రాంగం ఉంది దేనికని ఫోన్‌లోనే సీఎస్‌ను నిలదీశారు. డీబీటీ ద్వారా కూడా ఒక్క రోజులో పెన్షన్ పంపిణీ చేయవచ్చునని సూచించారు. పెన్షన్ దారుల పూర్తి వివరాలన్నీ మీ వద్దే ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పెన్షన్ల పంపిణీ ఆలస్యం చేయాలనుకోవడం ఈ ప్రభుత్వ కుట్రలో భాగమని ఆరోపించారు.
ఎన్నికల కమీషన్ సూచన ప్రకారం వెంటనే పెన్షన్లు విడుదల చేయాలని సీఎస్‌ను వైఎస్ షర్మిలా రెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు ప్రజలకు పెన్షన్ అందించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఇప్పటికే సీఎస్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాసిన సంగతి తెలిసిందే.
మరిన్నీ ఏపీ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
AP News: ఈ సీఎంను కొనసాగించడం అవసరమా?
AP News: అచ్చెన్నాయుడి తల్లి మృతి: చంద్రబాబు, లోకేష్ సంతాపం