YSRCP : సజ్జల భార్గవ్ కేసుల వివరాలన్నీ ఇవ్వండి
ABN , Publish Date - Dec 17 , 2024 | 05:59 AM
సామాజిక మాధ్యమాలలో అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టేలా ప్రోత్సహించారనే ఆరోపణలతో రాష్ట్రంలోని వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన 9 కేసులను కొట్టివేయాలని కోరుతూ వైసీపీ సోషల్

రెండు వారాల పాటు తొందరపాటు చర్యలు వద్దు
పోలీసులకు హైకోర్టు ఆదేశం.. విచారణ ఈ నెల 26కి వాయిదా
అమరావతి, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): సామాజిక మాధ్యమాలలో అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టేలా ప్రోత్సహించారనే ఆరోపణలతో రాష్ట్రంలోని వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన 9 కేసులను కొట్టివేయాలని కోరుతూ వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ వేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. విచారణను ఈనెల 26కి వాయిదా వేసింది. రెండువారాల పాటు భార్గవ్‌రెడ్డి విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్‌ఎన్ చక్రవర్తి సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తనపై కేసులు కొట్టివేయాలని కోరుతూ ఇటీవల భార్గవ్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. హైకోర్టులోనే తేల్చుకోవాలని ఆదేశించింది. దీంతో భార్గవ్‌రెడ్డి తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా.. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాదులు మహేశ్ జఠ్మలానీ, సిద్ధార్థ్ దవే, పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, పోలీసుల తరపు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) పాణిని సోమయాజి వాదనలు వినిపించారు.