Share News

హెచ్‌బీఎల్‌ ఇంజనీరింగ్‌కు రూ.1,522 కోట్ల ఆర్డర్‌

ABN , Publish Date - Dec 15 , 2024 | 02:16 AM

హెచ్‌బీఎల్‌ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌ (గతంలో హెచ్‌బీఎల్‌ పవర్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌).. చిత్తరంజన్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌ నుంచి...

హెచ్‌బీఎల్‌ ఇంజనీరింగ్‌కు రూ.1,522 కోట్ల ఆర్డర్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హెచ్‌బీఎల్‌ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌ (గతంలో హెచ్‌బీఎల్‌ పవర్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌).. చిత్తరంజన్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌ నుంచి రూ.1,522.40 కోట్ల విలువైన ఆర్డర్‌ను చేజిక్కించుకున్నట్లు ప్రకటించింది. ఆర్డర్‌లో భాగంగా 2,200 లోకోమోటివ్స్‌కు ఆన్‌-బోర్డ్‌ కొలిషన్‌ అవాయిడెన్స్‌ సిస్టమ్‌ (టీసీఏఎస్‌, కవచ్‌) పరికరాల సరఫరా, ఇన్‌స్టలేషన్‌, కమిషనింగ్‌ చేయాల్సి ఉంటుందని తెలిపింది. 12 నెలల కాలంలో ఈ ఆర్డర్‌ను పూర్తి చేయాల్సి ఉంటుందని హెచ్‌బీఎల్‌ ఇంజనీరింగ్‌ వెల్లడించింది.

Updated Date - Dec 15 , 2024 | 02:16 AM