Share News

దివీస్‌ లాభంలో 46% వృద్ధి

ABN , Publish Date - Nov 10 , 2024 | 01:45 AM

దివీస్‌ లేబొరేటరీస్‌.. సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.510 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం (రూ.348 కోట్లు)తో పోల్చితే...

దివీస్‌ లాభంలో 46% వృద్ధి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దివీస్‌ లేబొరేటరీస్‌.. సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.510 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం (రూ.348 కోట్లు)తో పోల్చితే లాభం 46.5 శాతం వృద్ధి చెందింది. త్రైమాసిక సమీక్షా కాలంలో కంపెనీ మొత్తం ఆదాయం కూడా రూ.1,995 కోట్ల నుంచి రూ.2,444 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో ఫారెక్స్‌ లాభాలు రూ.11 కోట్ల నుంచి రూ.29 కోట్లకు పెరిగాయని పేర్కొంది. కాగా స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన కంపెనీ రూ.2,407 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.518 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. సెప్టెంబరుతో ముగిసిన ప్రధమార్ధానికి గాను కంపెనీ రూ.4,640 కోట్ల కన్సాలిడేటెడ్‌ ఆదాయంపై రూ.940 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.

Updated Date - Nov 10 , 2024 | 01:45 AM