Share News

సినిమా థియేటర్లలో విక్రయించే పాప్‌కార్న్‌పై 5 శాతం పన్ను

ABN , Publish Date - Dec 25 , 2024 | 04:36 AM

సినిమా హాళ్లు లేదా ఇతర ప్రాంతాల్లో లూజుగా విక్రయించే పాప్‌కార్న్‌పై 5 శాతం జీఎ్‌సటీ వర్తిస్తుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టత నిచ్చాయి. ఒకవేళ పాప్‌కార్న్‌ను సినిమా టికెట్‌తో కలిపి విక్రయిస్తే...

సినిమా థియేటర్లలో విక్రయించే పాప్‌కార్న్‌పై 5 శాతం పన్ను

సినిమా హాళ్లు లేదా ఇతర ప్రాంతాల్లో లూజుగా విక్రయించే పాప్‌కార్న్‌పై 5 శాతం జీఎ్‌సటీ వర్తిస్తుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టత నిచ్చాయి. ఒకవేళ పాప్‌కార్న్‌ను సినిమా టికెట్‌తో కలిపి విక్రయిస్తే, దాన్ని కాంపొజిట్‌ సప్లైగా పరిగణించి, అందుకు వర్తించే పన్ను రేటును వసూలు చేయడం జరుగుతుందని వారు తెలిపారు. పాప్‌కార్న్‌పై వర్తించే పన్ను రేటుపై జీఎ్‌సటీ మండలి గత సమావేశంలో స్పష్టత నిచ్చింది. ఉప్పు, మసాలా దినుసులు కలిసిన పాప్‌కార్న్‌ను ప్రస్తుతం నమ్‌కీన్‌గా పరిగణిస్తున్నారు. కాబట్టి ఈ పాప్‌కార్న్‌ లూజు విక్రయంపై 5 శాతం పన్ను వర్తిస్తుందని.. ప్రీ-ప్యాకేజ్డ్‌, లేబుల్‌తో విక్రయిస్తే మాత్రం 12 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని మండలి స్పష్టం చేసింది. చక్కెర కలిపిన (క్యారమెలైజ్డ్‌) పాప్‌కార్న్‌పైన 18 శాతం జీఎ్‌సటీ చెల్లించాల్సి ఉంటుంది.

Updated Date - Dec 25 , 2024 | 04:36 AM