Share News

మార్కెట్లో మళ్లీ నష్టాలే..

ABN , Publish Date - Nov 09 , 2024 | 06:09 AM

ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఒకదశలో 424 పాయింట్లకు పైగా క్షీణించినప్పటికీ, చివరికి 55.47 పాయింట్ల నష్టంతో 79,486.32 వద్ద స్థిరపడింది.

మార్కెట్లో మళ్లీ నష్టాలే..

8 సెన్సెక్స్‌ 55 పాయింట్లు డౌన్‌

ముంబై: ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఒకదశలో 424 పాయింట్లకు పైగా క్షీణించినప్పటికీ, చివరికి 55.47 పాయింట్ల నష్టంతో 79,486.32 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 51.15 పాయింట్లు కోల్పోయి 24,148.20 వద్ద ముగిసింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ వంటి దిగ్గజ షేర్లలో అమ్మకాలతో పాటు విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల ఉపసంహరణ ఇందుకు కారణమయ్యాయి. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 13 నష్టపోగా.. ఏషియన్‌ పెయింట్స్‌, టాటా స్టీల్‌ 2 శాతానికి పైగా క్షీణించి సూచీ టాప్‌ లూజర్లుగా మిగిలాయి. కాగా, ఆర్‌ఐఎల్‌ 1.66 శాతం, ఎస్‌బీఐ 1.86 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.53 శాతం తగ్గాయి. చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్లలో మాత్రం అమ్మకాల ఒత్తిడి అధికమైంది. దాంతో బీఎ్‌సఈలోని స్మాల్‌, మిడ్‌క్యాప్‌ సూచీలు 1.52 శాతం వరకు పతనమయ్యాయి.

ఈనెల 20న మార్కెట్లకు సెలవు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈ ఈ నెల 20న (బుధవారం) సెలవు పాటించనున్నాయి. ఆ రోజు ఈక్విటీ, ఎఫ్‌ అండ్‌ ఓ, సెక్యూరిటీస్‌ లెండింగ్‌ అండ్‌ బారోయింగ్‌ (ఎ్‌సఎల్‌బీ) విభాగాల్లో ట్రేడింగ్‌ జరగదు.

Updated Date - Nov 09 , 2024 | 06:10 AM