Share News

ఐదు రోజుల ర్యాలీకి బ్రేక్‌

ABN , Publish Date - Apr 27 , 2024 | 05:31 AM

వరుసగా ఐదు రోజుల పాటు లాభాల్లో పయనించిన ప్రామాణిక ఈక్విటీ సూచీలు శుక్రవారం నష్టాల్లోకి మళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మదుపరులు బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌ రంగ

ఐదు రోజుల ర్యాలీకి బ్రేక్‌

సెన్సెక్స్‌ 609 పాయింట్లు డౌన్‌

ముంబై: వరుసగా ఐదు రోజుల పాటు లాభాల్లో పయనించిన ప్రామాణిక ఈక్విటీ సూచీలు శుక్రవారం నష్టాల్లోకి మళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మదుపరులు బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌ రంగ షేర్లలో లాభా ల అమ్మకాలకు పాల్పడటం ఇందుకు కారణమైంది. ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి క్షీణత, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల ఉపసంహరణ మార్కెట్‌పై ఒత్తిడిని మరింత పెంచాయి. వారాంతం ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 609.28 పాయింట్లు కోల్పోయి 73,730.16 వద్దకు జారుకుంది. నిఫ్టీ 150.40 పాయింట్ల నష్టంతో 22,419.95 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 24 నష్టపోయాయి.


బజాజ్‌ ఫైనాన్స్‌ 7.73 శాతం క్షీణించి సూచీ టాప్‌ లూజర్‌గా మిగిలింది. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌, నెస్లే షేర్లు మూడు శాతానికి పైగా నష్టపోయాయి. టెక్‌ మహీంద్రా షేరు మాత్రం 7.34 శాతం ఎగిసి సెన్సెక్స్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ప్రధాన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనైనప్పటికీ చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్లలో కొనుగోళ్లు కొనసాగాయి. దాంతో బీఎ్‌సఈ మిడ్‌క్యాప్‌ సూచీ 0.83 శాతం, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.27 శాతం పెరిగాయి. రంగాలవారీ సూచీల్లో బ్యాంకెక్స్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అర శాతానికి పైగా నష్టపోయాయి.

Updated Date - Apr 27 , 2024 | 05:32 AM