Share News

ఆగని రికార్డుల హోరు

ABN , Publish Date - Jun 27 , 2024 | 05:38 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో వరుసగా మూడో రోజూసరికొత్త రికార్డులు నమోదయ్యాయి. సెన్సెక్స్‌ 620.73 పాయింట్ల లాభంతో 78,674.25 వద్ద, నిఫ్టీ 147.5 పాయింట్ల లాభంతో 23,868.80 వద్ద క్లోజయ్యాయి...

ఆగని రికార్డుల హోరు

మూడో రోజూ లాభపడిన మార్కెట్‌

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో వరుసగా మూడో రోజూసరికొత్త రికార్డులు నమోదయ్యాయి. సెన్సెక్స్‌ 620.73 పాయింట్ల లాభంతో 78,674.25 వద్ద, నిఫ్టీ 147.5 పాయింట్ల లాభంతో 23,868.80 వద్ద క్లోజయ్యాయి. ఇంట్రా డేలోనూ సూచీలు జీవిత కాల గరిష్ఠ స్థాయిలను తాకాయి. గత మూడు రోజుల ర్యాలీతో మదుపరుల సంపద రూ.2.53 లక్షల కోట్లు పెరిగింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వంటి లార్జ్‌ క్యాప్‌ షేర్లలో ర్యాలీ, ఆసియా మార్కెట్ల లాభాలతో మదుపరులు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు దిగడం, ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు ఎనిమిది శాతానికి చేరువలో ఉంటుందనే అంచనాలు, తగ్గుతున్న ద్రవ్యోల్బణంతో త్వరలోనే వడ్డీ రేట్టు తగ్గుతాయనే అంచనాలు, ఎఫ్‌పీఐల కొనుగోళ్లు బుధవారం నాటి ర్యాలీకి దోహదం చేశాయి.


‘రిలయన్స్‌’ షేర్ల జోరు : బుధవారం నాటి ర్యాలీకి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లలో ర్యాలీ బాగా దోహదం చేసింది. బీఎ్‌సఈలో ఈ కంపెనీ షేర్లు 4.09 శాతం లాభంతో రూ.3.027.40 వద్ద ముగిశాయి. దీంతో బుధవారం ఒక్కరోజే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్ల మార్కెట్‌ క్యాప్‌ రూ.80359.48 కోట్లు పెరిగి రూ.20,48,282.28 కోట్లకు చేరింది.

Updated Date - Jun 27 , 2024 | 05:38 AM