Share News

లాభాల స్వీకారంతో కుంగిన మార్కెట్‌

ABN , Publish Date - Oct 31 , 2024 | 01:27 AM

బుధవారం ఈక్విటీ మార్కెట్‌ లాభాల స్వీకారంతో కుంగిపోయింది. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగాల షేర్లలో అమ్మకాలు జోరుగా సాగాయి. కార్పొరేట్‌ ఫలితాలు నిరాశావహంగా ఉండడం, విదేశీ నిధులు...

లాభాల స్వీకారంతో కుంగిన మార్కెట్‌

ముంబై: బుధవారం ఈక్విటీ మార్కెట్‌ లాభాల స్వీకారంతో కుంగిపోయింది. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగాల షేర్లలో అమ్మకాలు జోరుగా సాగాయి. కార్పొరేట్‌ ఫలితాలు నిరాశావహంగా ఉండడం, విదేశీ నిధులు తరలిపోవడం సెంటిమెంట్‌ను దెబ్బ తీశాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 426.85 పాయింట్లు నష్టపోయి 79942.18 వద్ద ముగియగా నిఫ్టీ 126 పాయింట్లు నష్టపోయి 24340.85 వద్ద ముగిసింది. స్టాక్‌ ఎక్స్ఛేంజిల వద్ద ఉన్న గణాంకాల ప్రకారం మంగళవారం విదేశీ ఇన్వెస్టర్లు రూ.548.69 కోట్ల విలువ గల షేర్లు విక్రయించారు. అయితే ఎఫ్‌ఐఐల అమ్మకాల జోరు తగ్గడం ఒక సానుకూలాంశమని పరిశీలకులంటున్నారు. ‘‘భారత షేర్లు అమ్ము, చైనా షేర్లు కొను’’ అనే వైఖరి ముగింపు దశకు వచ్చిందనేందుకు ఇది సంకేతమన్నది వారి అభిప్రాయం. దీనికి తోడు దేశీయ సంస్థలు, రిటైల్‌ ఇన్వెస్టర్ల నిధులు జోడై సమీప భవిష్యత్తులో మార్కెట్‌ ఉత్తేజం పొందవచ్చునని వారంటున్నారు.


అదానీ షేర్లు జూమ్‌: అదానీ గ్రూప్‌ షేర్ల మార్కెట్‌ విలువ ఈ వారంలో రూ.39,000 కోట్లు పెరిగి రూ.15.5 లక్షల కోట్లకు చేరింది. గ్రూప్‌లోని 10 లిస్టెడ్‌ కంపెనీల్లో 9 కంపెనీల మార్కెట్‌ విలువ గత మూడు రోజుల్లో గణనీయంగా పెరిగింది. రూ.23,268 కోట్ల విలువతో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ అగ్రగామిగా నిలవగా అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ రూ.9,440 కోట్లతో రెండో స్థానంలో ఉంది. గ్రూ్‌పలో ఒక్క అదానీ పవర్‌ లిమిటెడ్‌ మాత్రమే నష్టపోయింది.

Updated Date - Oct 31 , 2024 | 01:27 AM