Share News

తమిళనాడులో ఆచ్చి మసాలా కొత్త ఫ్యాక్టరీ

ABN , Publish Date - Sep 20 , 2024 | 05:06 AM

ఆహార ఉత్పత్తుల రంగంలోని ఆచ్చి మసాలా తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కవరపేట సమీపంలో కొత్త ఫ్యాక్టరీని ప్రారంభించింది. కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌ ఢిల్లీ నుండి...

తమిళనాడులో ఆచ్చి మసాలా కొత్త ఫ్యాక్టరీ

చెన్నై (ఆంధ్రజ్యోతి): ఆహార ఉత్పత్తుల రంగంలోని ఆచ్చి మసాలా తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కవరపేట సమీపంలో కొత్త ఫ్యాక్టరీని ప్రారంభించింది. కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌ ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ ఫ్యాక్టరీని ప్రారంభించినట్టు కంపెనీ చైర్‌పర్సన్‌ ఏడీ పద్మసింగ్‌ ఐజాక్‌ తెలిపారు. ఢిల్లీలో వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా 2024 సద స్సు సందర్భంగా తాము ఈ ఫ్యాక్టరీని ప్రారంభించినట్టు ఆమె చెప్పారు. రెండున్నర దశాబ్దాలకు పైగా ఆహార, మసాలా వస్తువుల తయారీలో పేరెన్నిక గన్న ఆచ్చి మసాలా ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 65 దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతిచేస్తోందని ఆమె తెలిపారు. తమ సంస్థ 220 రకాల ఆహారవస్తువులను తయారు చేసి, 15 లక్షల దుకాణాల ద్వారా దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. తమ సంస్థలన్నింటిలోనూ అత్యధికంగా మహిళలే పనిచేస్తున్నారన్నారు.


కేంద్రప్రభుత్వం పీఎల్‌ఐ పథకం ద్వారా రూ. 150 కోట్ల ప్రాజెక్టు తమకు అందించడమే కాకుండా రూ.80 కోట్ల వరకు సబ్సిడీని ఇచ్చిందన్నారు. ఆ ప్రాజెక్టు ద్వారా ఏర్పాటైన రెండు ఫ్యాక్టరీలలో అదనంగా 500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పారు. వచ్చే మూడేళ్లలో రూ.80 కోట్లు పెట్టుబడి పెట్టనున్నామని సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అశ్విని పాండియన్‌ తెలిపారు.

Updated Date - Sep 20 , 2024 | 05:06 AM