Share News

ప్యూరిట్‌ కొనుగోలు పూర్తి

ABN , Publish Date - Nov 02 , 2024 | 06:15 AM

హిందుస్తాన్‌ యునీలీవర్‌కు చెందినన జలశుద్ధి వ్యాపారం ప్యూరిట్‌ కొనుగోలును పూర్తి చేసినట్టు ప్రపంచ వాటర్‌ టెక్నాలజీ కంపెనీ ఏఓ స్మిత్‌ కార్పొరేషన్‌ ప్రకటిం చింది.

ప్యూరిట్‌ కొనుగోలు పూర్తి

న్యూఢిల్లీ: హిందుస్తాన్‌ యునీలీవర్‌కు చెందినన జలశుద్ధి వ్యాపారం ప్యూరిట్‌ కొనుగోలును పూర్తి చేసినట్టు ప్రపంచ వాటర్‌ టెక్నాలజీ కంపెనీ ఏఓ స్మిత్‌ కార్పొరేషన్‌ ప్రకటిం చింది. ‘‘ప్యూరిట్‌’’ బ్రాండ్‌ కింద తాము నిర్వహిస్తున్న వాటర్‌ టెక్నాలజీ వ్యాపార విభాగం విక్రయం పూర్తి చేశామని హెచ్‌యూఎల్‌ ఒక రెగ్యులేటరీ ప్రకటనలో తెలిపింది. ఈ వ్యాపార విభాగాన్ని ఏఓ స్మిత్‌కు 7.2 కోట్ల డాలర్లకు (రూ.600 కోట్లు) విక్రయించినట్టు గత జూలైలో హెచ్‌యూఎల్‌ ప్రకటించింది. 2023-24 సంవత్సరంలో ఈ విభాగం టర్నోవర్‌ రూ.293 కోట్లుంది. హెచ్‌యూఎల్‌ మొత్తం టర్నోవర్‌లో దీని వాటా 1 శాతం కన్నా తక్కువే.

Updated Date - Nov 02 , 2024 | 06:15 AM