Share News

సౌర, పవన విద్యుత్‌పై అదానీ గ్రూప్‌ ఫోకస్‌

ABN , Publish Date - Jun 26 , 2024 | 04:46 AM

సౌర,పవన వంటి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులపై అదానీ గ్రూప్‌ పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతోంది. 2030 నాటికి ఈ రంగంలో విద్యుదుత్పత్తి సామర్ధ్యాన్ని ప్రస్తుత 10,000 మెగావాట్ల నుంచి 50,000 మెగావాట్లకు...

సౌర, పవన విద్యుత్‌పై అదానీ గ్రూప్‌ ఫోకస్‌

  • 2030 నాటికి 50,000 మెగావాట్ల సామర్ధ్యం

  • రూ.2 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు

  • ఏపీలో 500 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ ప్లాంట్‌

అహ్మదాబాద్‌: సౌర,పవన వంటి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులపై అదానీ గ్రూప్‌ పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతోంది. 2030 నాటికి ఈ రంగంలో విద్యుదుత్పత్తి సామర్ధ్యాన్ని ప్రస్తుత 10,000 మెగావాట్ల నుంచి 50,000 మెగావాట్లకు విస్తరించాలని భావిస్తోంది. ఇందుకోసం రూ.2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సాగర్‌ అదానీ ఈ విషయం వెల్లడించారు. ఇందు లో 80 శాతం సౌర విద్యుత్‌ ద్వారా, మిగతాది పవన విద్యుత్‌ ద్వారా ఉత్పత్తి చేస్తామని తెలిపారు. ఇందుకు అవసరమైన సౌర ఫలకాలు, టర్బైన్స్‌ను కూడా సొంతంగా తయారు చేస్తామన్నారు.


ఏపీలో పంప్డ్‌ స్టోరేజీ ప్లాంట్‌ పనులు షురూ

పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులతో పాటు రాత్రి సమయాల్లో ఉప యోగించుకునేందుకు వీలుగా 5,000 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్టు అదానీ గ్రీన్‌ ఎనర్జీ కంపెనీ సీఈఓ అమిత్‌ సింగ్‌ చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ లో 500 మెగావాట్ల సామర్ధ్యంతో కూడిన పంప్డ్‌ స్టోరేజీ ప్లాంట్‌ నిర్మాణ పనుల ను ప్రారంభించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రల్లో జల విద్యుత్‌ కేంద్రాల వద్ద విద్యుత్‌ నిల్వ కోసం పెద్ద ఎత్తున పంప్డ్‌ స్టోరేజీ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంద న్నారు. అదానీ గ్రూప్‌ కంపెనీలు అన్నీ కలిసి 2024-25లో వ్యాపార విస్తరణ కోసం రూ.1.3 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి.

Updated Date - Jun 26 , 2024 | 04:46 AM