మహారాష్ట్రకు అదానీ పవర్ విద్యుత్
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:29 AM
అదానీ పవర్ కంపెనీకి భారీ కాంట్రా క్టు లభించనుంది. దాదాపు 6,600 మెగావాట్ల థర్మల్, సౌర విద్యుత్ సరఫరా కోసం మహారాష్ట్ర విద్యుత్ పంపిణీ కంపెనీ (ఎంఎస్‌ఈడీసీఎల్) ఫ్లోట్ చేసిన...
న్యూఢిల్లీ: అదానీ పవర్ కంపెనీకి భారీ కాంట్రా క్టు లభించనుంది. దాదాపు 6,600 మెగావాట్ల థర్మల్, సౌర విద్యుత్ సరఫరా కోసం మహారాష్ట్ర విద్యుత్ పంపిణీ కంపెనీ (ఎంఎస్‌ఈడీసీఎల్) ఫ్లోట్ చేసిన టెండర్‌కు అదానీ పవర్ కంపెనీ యూనిట్‌కు రూ.4.08 ధర కోట్ చేసింది. జేఎస్‌డబ్ల్యు ఎనర్జీ, టోరెంట్ ఎనర్జీ కంపెనీల కంటే ఇది తక్కువ ధర. దీంతో ఈ కాంట్రాక్టు దాదాపుగా అదానీ పవర్‌కే లభిస్తుందని భావిస్తున్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కుదిరిన 48 నెలల్లో అదానీ పవర్ ఈ విద్యుత్ సరఫరా ప్రారంభిస్తుంది.