జికా వైరస్ బారి నుంచి కాపాడే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు (ఐసీఎంఆర్)తో ఒప్పందం
ABN , Publish Date - Sep 13 , 2024 | 05:00 AM
జికా వైరస్ బారి నుంచి కాపాడే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)తో ఒప్పందం (ఎంఓఏ) కుదుర్చుకున్నట్లు...
జికా వైరస్ బారి నుంచి కాపాడే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)తో ఒప్పందం (ఎంఓఏ) కుదుర్చుకున్నట్లు ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్) గురువారం ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా జికా వ్యాక్సిన్ అభివృద్ధి కోసం తాము జరిపే క్లినికల్ ట్రయల్స్ మొదటి దశ వ్యయాన్ని ఐసీఎంఆర్ భరించనుంది.
మారుతి సుజుకీ మార్కెట్లోకి సరికొత్త ఎపిక్ స్విఫ్ట్ ఎస్-సీఎన్జీ విడుదల చేసింది. మూడు వేరియంట్లలో ఈ హ్యాచ్‌బ్యాక్ కారు అందుబాటులో ఉండనుంది. ఒక కేజీ సీఎన్జీతో 32.85 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని మారుతి సుజుకీ వెల్లడించింది. ఈ కారు ధరలు రూ.81.9 లక్షల నుంచి 9.19 లక్షల మధ్యన ఉన్నాయి.
బ్రిగేడ్ గ్రూప్.. హైదరాబాద్‌లో బిజ్వర్క్స్ పేరుతో ఫ్లెక్సిబుల్ వర్క్ప్లే్సలోకి అడుగుపెట్టింది. హైటెక్ సిటీ లో అరో ఆర్బిట్‌లో మొత్తం 25 వేల చదరపు అడుగుల్లో ఈ వర్క్ప్లే్సను ఏర్పాటు చేసింది. కాగా వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి వర్క్ప్లే్సను 10 లక్షల చదరపు అడుగులకు విస్తరించాలని బ్రిగేడ్ గ్రూప్ భావిస్తోంది.
కిష్ణ డైమండ్ అండ్ గోల్డ్ జువెలరీ.. హైదరాబాద్‌లో కొత్తగా 2షోరూమ్‌లు ప్రారంభించింది. ఏఎస్ రావు నగర్, సోమాజీగూడలో ఈ షోరూమ్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ షోరూమ్స్‌తో హైదరాబాద్‌లో స్టోర్ల సంఖ్య నాలుగుకు చేరుకోగా దేశవ్యాప్తంగా 38కి చేరుకున్నాయి.
గృహ నిర్మాణ రంగంలోని బ్రిక్ అండ్ బోల్ట్.. హైదరాబాద్‌లో కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా నిర్మాణ సొల్యూషన్స్‌ను ఈ సెంటర్ అందించనుంది.
మొక్కజొన్న, సోయాబీన్ కోసం అడ్వాన్స్డ్ కీటక నాశిని ప్రొక్లెయిమ్ ఎక్స్ట్రాను క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ విడుదల చేసింది. 30, 150, 300 ఎంఎ ల్, లీటర్ ప్యాక్ సైజుల్లో ఇది అందుబాటులో ఉండనుంది.