ఆద్యంతం ఊగిసలాటలే..
ABN , Publish Date - Nov 12 , 2024 | 05:58 AM
విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల ఉపసంరహరణ, నిరాశాజనక త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, ఆసియా మార్కెట్ల బలహీన సంకేతాల నేపథ్యంలో...
మిశ్రమంగా ముగిసిన సూచీలు
ముంబై: విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల ఉపసంరహరణ, నిరాశాజనక త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, ఆసియా మార్కెట్ల బలహీన సంకేతాల నేపథ్యంలో ప్రామాణిక ఈక్విటీ సూచీలు సోమవారం ట్రేడింగ్‌లో తీవ్ర ఊగిసలాటలకు లోనయ్యాయి. 1,100 పాయింట్ల శ్రేణిలో కదలాడిన సెన్సెక్స్.. 79,001.34 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని, 80,102.14 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 9.83 పాయింట్ల లాభంతో 79,496.15 వద్ద ముగిసింది. నిఫ్టీ మాత్రం 6.90 పాయింట్ల నష్టంతో 24,141.30 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 18 నష్టపోగా.. ఏషియన్ పెయింట్స్ షేరు ఏకంగా 8.18 శాతం క్షీణించి సూచీ టాప్ లూజర్‌గా నిలిచింది.