Share News

సైయెంట్‌ డీఎల్‌ఎం చేతికి ఆల్‌టెక్‌ ఎలక్ట్రానిక్స్‌

ABN , Publish Date - Oct 05 , 2024 | 02:52 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న సైయెంట్‌ డీఎల్‌ఎం.. అమెరికాలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరిస్తోంది.

సైయెంట్‌ డీఎల్‌ఎం చేతికి ఆల్‌టెక్‌  ఎలక్ట్రానిక్స్‌

  • డీల్‌ విలువ రూ.245 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న సైయెంట్‌ డీఎల్‌ఎం.. అమెరికాలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా అమెరికా కేంద్రంగా పనిచేసే ‘ఆల్‌టెక్‌ ఎలకా్ట్రనిక్స్‌’ను 2.92 కోట్ల డాలర్లకు (సుమారు రూ.245 కోట్లు) కొనుగోలు చేసింది. వైద్య, ఆరోగ్య, పారిశ్రామిక, రక్షణ రంగాలకు అవసరమైన ఎలకా్ట్రనిక్‌ ఉత్పత్తుల డిజైన్‌, తయారీ రంగాల్లో ఆల్‌టెక్‌కు మంచి పేరుంది. అమెరికా రక్షణ శాఖ కూడా ఈ కంపెనీ సేవలు అందుకుంటోంది. ఈ కొనుగోలుతో అంతర్జాతీయ ఎలకా్ట్రనిక్స్‌ సేవల రంగంలో తమ పట్టు మరింత పెరుగుతుందని సైయెంట్‌ డీఎల్‌ఎం ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ కృష్ణ బోదనపు అన్నారు.

Updated Date - Oct 05 , 2024 | 02:52 AM