Share News

హైదరాబాద్‌లో అల్ర్టా వయొలెట్‌ స్పేస్‌ స్టేషన్‌

ABN , Publish Date - Sep 20 , 2024 | 05:09 AM

విద్యుత్‌ బైక్‌ల తయారీలోని అల్ర్టా వయొలెట్‌ హైదరాబాద్‌లో స్పేస్‌ స్టేషన్‌ను (షోరూమ్‌) ప్రారంభించింది. ఇప్పటికే ఇతర నగరాల్లో తాము విక్రయిస్తున్న ఎఫ్‌77 మాక్‌ 2 బైక్‌ను మార్కె ట్లో...

హైదరాబాద్‌లో అల్ర్టా వయొలెట్‌ స్పేస్‌ స్టేషన్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): విద్యుత్‌ బైక్‌ల తయారీలోని అల్ర్టా వయొలెట్‌ హైదరాబాద్‌లో స్పేస్‌ స్టేషన్‌ను (షోరూమ్‌) ప్రారంభించింది. ఇప్పటికే ఇతర నగరాల్లో తాము విక్రయిస్తున్న ఎఫ్‌77 మాక్‌ 2 బైక్‌ను మార్కె ట్లో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ, వ్యవస్థాపకుడు నారాయణ్‌ సుబ్రమణియం మాట్లాడుతూ బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న తమ కంపెనీ విక్రయాలు ప్రారంభించిన ఐదో నగరం హైదరాబాద్‌ అని చెప్పారు. శుక్రవారం ముంబైలో రేసింగ్‌ సూపర్‌ బైక్‌ ఎఫ్‌99ని ఆవిష్కరించనున్నట్టు ఆయన తెలిపారు. వచ్చే రెండుమూడేళ్ల కాలంలో మరిన్ని కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నామన్నారు. ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని 10 నగరాలకు విస్తరించాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. అలాగే వచ్చే నెలలో యూరోపియన్‌ మార్కెట్లోకి కూడా తాము ప్రవేశించనున్నట్టు నారాయణ్‌ తెలిపారు. ఎఫ్‌ 77 బైక్‌ ఒక సారి పూర్తిగా చార్జి చేసినట్టయితే 323 కిలోమీటర్లు నడుస్తుందన్నారు.


ఇది రెండు వేరియెంట్లలో అందుబాటులో ఉంటుందంటూ 7 కిలోవాట్‌ బైక్‌ ధర రూ.2.99 లక్షలని, 10 కిలోవాట్‌ బైక్‌ ధర రూ.3.99 లక్షలని ఆయన వెల్లడించారు. ఈ బైక్‌ గంటకు 155 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందంటూ ఎఫ్‌ 99 బైక్‌ గంటకు 265 కిలోమీటర్ల వేగం కలిగి ఉంటుందని చెప్పారు.

Updated Date - Sep 20 , 2024 | 05:09 AM