Share News

అమర రాజా ఎనర్జీ లాభం రూ.241 కోట్లు

ABN , Publish Date - Nov 05 , 2024 | 04:01 AM

అమర రాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ లిమిటెడ్‌ (ఏఆర్‌ఈఎం).. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన రూ.3,154.30 కోట్ల మొత్తం...

అమర రాజా ఎనర్జీ లాభం రూ.241 కోట్లు

ఒక్కో షేరుకు 530% మధ్యంతర డివిడెండ్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అమర రాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ లిమిటెడ్‌ (ఏఆర్‌ఈఎం).. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన రూ.3,154.30 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.240.71 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో మొత్తం ఆదాయం రూ.2,838.82 కోట్లుగా ఉండగా లాభం రూ.226.40 కోట్లుగా ఉంది. త్రైమాసిక సమీక్షా కాలంలో కంపెనీ మొత్తం వ్యయాలు రూ.2,530.09 కోట్ల నుంచి రూ.2,830.33 కోట్లకు పెరిగాయి. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో రూ.1 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.5.30 (530 శాతం) మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ డైరెక్టర్ల బోర్డు ప్రకటించింది.


డివిడెండ్‌ చెల్లింపునకు రికార్డు తేదీగా నవంబరు 14ను ఖరారు చేయగా డిసెంబరు 3 లోగా చెల్లింపులు చేపట్టనున్నట్లు అమర రాజా ప్రకటించింది. కాగా అనుబంధ సంస్థ అమర రాజా అడ్వాన్స్‌డ్‌ సెల్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏఆర్‌ఏసీటీ)లో పెట్టుబడుల పరిమితిని రూ.1,000 కోట్ల నుంచి రూ.2,000 కోట్లకు పెంచినట్లు వెల్లడించింది.

Updated Date - Nov 05 , 2024 | 04:01 AM