అమెజాన్ బిజినెస్ వాల్యూ డేస్ షురూ
ABN , Publish Date - Nov 22 , 2024 | 05:34 AM
బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ) ప్లాట్‌ఫాం అమెజాన్ బిజినెస్ మళ్లీ ‘బిజినెస్ వాల్యూ డేస్’ ప్రారంభించింది. గురువారం ప్రారంభమైన ఈ అమ్మకాలు వచ్చే నెల ఆరవ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సమయంలో తమ బీ2బీ ప్లాట్‌ఫాం ద్వారా...
న్యూఢిల్లీ: బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ) ప్లాట్‌ఫాం అమెజాన్ బిజినెస్ మళ్లీ ‘బిజినెస్ వాల్యూ డేస్’ ప్రారంభించింది. గురువారం ప్రారంభమైన ఈ అమ్మకాలు వచ్చే నెల ఆరవ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సమయంలో తమ బీ2బీ ప్లాట్‌ఫాం ద్వారా కొనే వస్తువుల గరిష్ఠ ధరపై 70 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుందని అమెజాన్ బిజినెస్ తెలిపింది. దీనికి తోడు బిజినెస్ కస్టమర్లకు రూ.9,999 వరకు క్యాష్‌బాక్ కూడా లభిస్తుంది. ఈ 16 రోజుల బిజినెస్ వాల్యూ డేస్ కోసం 16 లక్షల మందికిపైగా అమ్మకందారులు 19 కోట్లకుపైగా వస్తువులను అమ్మకానికి పెట్టినట్టు తెలిపింది.