Share News

20-21 తేదీల్లో అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్స్‌

ABN , Publish Date - Jul 03 , 2024 | 01:59 AM

ఈ నెల 20-21 తేదీల్లో ప్రైమ్‌ డే సేల్‌ను నిర్వహించనున్నట్లు అమెజాన్‌ ఇండియా ప్రకటించింది. ఈ సందర్భంగా అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యులకు అన్ని వస్తువులపై ప్రత్యేక డిస్కౌంట్‌లు...

20-21 తేదీల్లో అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్స్‌

న్యూఢిల్లీ: ఈ నెల 20-21 తేదీల్లో ప్రైమ్‌ డే సేల్‌ను నిర్వహించనున్నట్లు అమెజాన్‌ ఇండియా ప్రకటించింది. ఈ సందర్భంగా అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యులకు అన్ని వస్తువులపై ప్రత్యేక డిస్కౌంట్‌లు, ఆఫర్లు ఉంటాయని తెలిపింది. ప్రైమ్‌ ఖాతాదారులు 450 బ్రాండ్స్‌కు చెందిన వేలాది వస్తువులను ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లలో కొనుగోలు చేయవ చ్చు. ఈ వస్తువులు అదే రోజు లేదా మరుసటి రోజు ప్రైమ్‌ సభ్యులకు డెలివరీ చేస్తారు. కాగా దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు కూడా అదే రోజు లేదా మరుసటి రోజున డెలివరీ చేయాలని చూస్తున్నట్లు తెలిపింది.

Updated Date - Jul 03 , 2024 | 01:59 AM