Anant Ambani Radhika Merchant Wedding: రేపే అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి.. గెస్టుల కోసం 100 విమానాలు, 3 ఫాల్కన్ జెట్‌లు, ఇంకా..
ABN , Publish Date - Jul 11 , 2024 | 11:42 AM
భారతదేశ అత్యంత ధనవంతుడు, ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ(Anant Ambani), రాధికా మర్చంట్(Radhika Merchant) శుక్రవారం ముంబైలో వివాహం చేసుకోనున్నారు. అయితే పెళ్లికి వచ్చే అతిథుల కోసం ముకేశ్ అంబానీ ఎలాంటి ప్లాన్ చేశారో ఇప్పుడు చుద్దాం.
భారతదేశ అత్యంత ధనవంతుడు, ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ(Anant Ambani), రాధికా మర్చంట్(Radhika Merchant)లు శుక్రవారం (జులై 12న) ముంబైలో వివాహం చేసుకోనున్నారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పలువురు ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానం అందింది. వీరిలో అనేక కంపెనీల గ్లోబల్ సీఈఓలు కూడా ఉన్నారు.
ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీల్లో సౌదీ అరామ్‌కో సీఈవో అమిన్ నాసర్, హెచ్‌ఎస్‌బీసీ గ్రూప్ ఛైర్మన్ మార్క్ టక్కర్, అడోబ్ భారతీయ సంతతికి చెందిన సీఈవో శంతను నారాయణ్, మోర్గాన్ స్టాన్లీ ఎండి మైఖేల్ గ్రిమ్స్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ జే లీ, ముబాదలా ఎండి ఖల్దున్ అల్ ముబారక్, బీపీ సిఇఒ ముర్రే వంటి పలువురు వ్యాపార ప్రముఖులు ఉన్నారు. ఈ నేపథ్యంలో పెళ్లికి వచ్చే అతిథుల కోసం ముకేశ్ అంబానీ ఎలాంటి ప్లాన్ చేశారో ఇక్కడ తెలుసుకుందాం.
100కుపైగా విమానాలు
శుక్రవారం (జులై 12న) ముంబైలో జరగనున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకకు వచ్చే అతిథుల కోసం ముకేశ్ అంబానీ సూపర్ లగ్జరీ ప్రణాళికను సిద్ధం చేశారు. వచ్చిన అతిథులను తీసుకొచ్చేందుకు మూడు ఫాల్కన్ 2000 జెట్‌లు, 100కుపైగా ప్రైవేట్ విమానాలను అద్దెకు తీసుకున్నారు. అన్ని వివాహ వేడుకలు సాంప్రదాయ హిందూ వైదిక ఆచారాల ప్రకారం జరుగుతాయి. ఈ జంట వివాహం జూలై 12న జరగనుండగా, ఆ తర్వాత జూలై 13న శుభ ఆశీర్వాదాల కార్యక్రమం, చివరగా జూలై 14న వివాహ రిసెప్షన్ వేడుక ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ సెంటర్‌లో జరుగుతాయి. దీంతో ఈ వివాహం దేశంలో అత్యంత ఖరీదైన వివాహాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
వివాహ మెను
పెళ్లి మెనులో వారణాసిలోని ప్రసిద్ధ 'కాశీ చాట్ భండార్' నుంచి ఐటెమ్‌లు ఉంటాయి. దీనిలో టిక్కీలు, టొమాటో చాట్, పాలక్ చాట్, చనా కచోరీ, కుల్ఫీ వంటి ఫాస్ట్ ఫుడ్ వంటి పలు రకాల వంటకాలను అందించే అవకాశం ఉంది. రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్ నీతా అంబానీ గత నెలలో వారణాసి పర్యటన సందర్భంగా మెనూను ఖరారు చేసినట్లు షాప్ యజమాని రాకేష్ కేశరీ తెలిపారు.
5 స్టార్ హోటల్స్
ఈ పెళ్లి నేపథ్యంలో అక్కడి హోటళ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో ముంబైలోని పశ్చిమ సబర్బ్ బాంద్రా, BKCలోని హోటల్ గదులు పూర్తిగా బుక్కయిపోయాయి. వాటిలో హోటల్స్ ట్రైడెంట్, ఒబెరాయ్ వెబ్‌సైట్‌ల ప్రకారం జూలై 10 నుంచి జూలై 14 వరకు గదులు అందుబాటులో లేవని ప్రకటించారు. ది లలిత్, ITC మరాఠా, తాజ్ శాంతా క్రజ్, గ్రాండ్ హయత్‌లతో సహా BKC ప్రాంతానికి సమీపంలోని 5 స్టార్ హోటళ్లలో కొన్ని గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
మరోవైపు ట్రాఫిక్ అలర్ట్
బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ సెంటర్‌లో పెళ్లి జరగనున్న నేపథ్యంలో ముంబైలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జూలై 12 నుంచి జూలై 15 వరకు ఈ వేదిక సమీపంలోని రోడ్లు మధ్యాహ్నం 1 నుంచి అర్ధరాత్రి మధ్య ఈవెంట్ వాహనాలకు మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆయా చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ మందగించింది.
ప్రీ వెడ్డింగ్ వేడుకలు
వివాహానికి ముందు ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ వేడుక మొదట జామ్‌నగర్‌లో ప్రారంభమైంది. ఆ తర్వాత యూరప్‌లో నాలుగు రోజుల విలాసవంతమైన విహారయాత్ర జరిగింది. చివరగా గత రెండు వారాల్లో ముంబైలో అనేక హై-ప్రొఫైల్ సంఘటనలు జరిగాయి. జస్టిన్ బీబర్, రిహన్న, కాటి పెర్రీ, బ్యాక్‌స్ట్రీట్ బాయ్స్ వంటి గ్లోబల్ స్టార్స్‌తో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ప్రీ వెడ్డింగ్ పార్టీలలో ప్రదర్శనలు ఇచ్చారు.
ఇది కూడా చదవండి:
ఎస్‌బీఐ రూ.10 వేల కోట్ల సమీకరణ
For Latest News and Business News click here