హైదరాబాద్లో అపర్ణ దక్కన్ టౌన్
ABN , Publish Date - Nov 12 , 2024 | 05:55 AM
అపర్ణ కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్లో మరో ప్రతిష్ఠాత్మక రెసిడెన్షియల్ వెంచర్ ప్రారంభించింది. గోపన్పల్లి-గచ్చిబౌలి ప్రాంతంలో 123 ఎకరాల్లో ఈ అలా్ట్ర లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ను...
123 ఎకరాల్లో టౌన్షి్ప ఏర్పాటు
తొలి దశలో రూ.2,851 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అపర్ణ కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్లో మరో ప్రతిష్ఠాత్మక రెసిడెన్షియల్ వెంచర్ ప్రారంభించింది. గోపన్పల్లి-గచ్చిబౌలి ప్రాంతంలో 123 ఎకరాల్లో ఈ అలా్ట్ర లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ను కంపెనీ ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా జీ+44 ఫ్లోర్లతో తొమ్మిది టవర్లు నిర్మిస్తారు. ఇందులో 99 ఇండిపెండెంట్ ప్రీమియం బంగ్లాలు. ఈ అలా్ట్ర లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలో ఒక్కో త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ విస్తీర్ణం 1,478 ఎస్ఎ్ఫటీ నుంచి 2,237 ఎస్ఎ్ఫటీ మధ్య ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ టౌన్షిప్ ప్రాజెక్ట్ తొలి దశ కోసం కంపెనీ రూ.2,851 కోట్లు ఖర్చు చేయనుంది.