మాల్స్, సినిమా వ్యాపారాల్లోకి అపర్ణ గ్రూప్
ABN , Publish Date - May 28 , 2024 | 04:01 AM
రియల్ ఎస్టేట్ సంస్థ అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్.. మాల్స్, సినిమా వ్యాపారాల్లోకి ప్రవేశించింది. ఇందులో భాగం గా హైదరాబాద్‌లోని నల్లగండ్ల ప్రాంతంలో...
హైదరాబాద్: రియల్ ఎస్టేట్ సంస్థ అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్.. మాల్స్, సినిమా వ్యాపారాల్లోకి ప్రవేశించింది. ఇందులో భాగం గా హైదరాబాద్‌లోని నల్లగండ్ల ప్రాంతంలో రూ.284 కోట్ల పెట్టుబడితో అపర్ణ నియో మాల్, అపర్ణ సినిమాస్‌ను నిర్మించింది. 3.67 ఎకరాల్లో 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో షాపింగ్ మాల్, సిని మా థియేటర్‌ను అభివృద్ధి చేసింది. మొత్తం పెట్టుబడిలో అపర్ణ నియో మాల్ కోసం రూ.252 కోట్లు, అపర్ణ సినిమాస్ కోసం రూ.32 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది.